ఏపీ ‘పద్మ’ అవార్డులలో ఒక ‘ప్రత్యేకత’

పద్మ పురస్కారాల జాతరలో రెండు తెలుగు రాష్ట్రాల నుంచి 14 మంది ఈ అవార్డులకు ఎంపికయ్యారు. అయితే ఏపీలో పురస్కారాలు దక్కించుకున్న వారి విషయంలో ఒక ప్రత్యేకత ఉంది. ఏపీలో ‘పద్మ’ పురస్కారాలు దక్కించుకున్న వారంతా ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు కావడం విశేషం. ‘ఈనాడు’ అధినేత రామోజీరావు, (పద్మవిభూషణ్), డాక్టర్ ఆళ్ళ వెంకట రామారావు (పద్మభూషణ్), యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ (పద్మభూషణ్), డా. ఆళ్ళ గోపాల కృష్ణ గోఖలే (పద్మశ్రీ), డా.యార్లగడ్డ నాయుడమ్మ (పద్మశ్రీ) లకు ఈ పురస్కారాలు దక్కాయి. వీరు కాక ఏపీ తరపున సునీతా కృష్ణన్ ను పద్మశ్రీ పురస్కారం వరించింది.

ఇక, తెలంగాణా నుంచి నాగేశ్వర రెడ్డి (పద్మభూషణ్), సైనా నెహ్వాల్ (పద్మభూషణ్), సానియా మీర్జా (పద్మభూషణ్), టీవీ నారాయణ (పద్మశ్రీ), మన్నన్ గోపీచంద్ (పద్మశ్రీ), లక్ష్మా గౌడ్ (పద్మశ్రీ) లకు ఈ అవార్డులు లభించాయి. పద్మ పురస్కారాలకు సంబంధించి తెలంగాణా ప్రభుత్వం గత సెప్టెంబరు 4 న కేంద్రానికి రెండు జాబితాలు పంపింది. మొదటి లిస్టులో 32 కొత్త పేర్లు ఉండగా, రెండో జాబితాలో 24 మంది పేర్లు ఉన్నాయి. వీటిలో లక్ష్మా గౌడ్ పేరును మాత్రమే పద్మశ్రీ అవార్డుకు ఎంపిక చేశారట.

పద్మవిభూషణ్ పురస్కారానికి విద్యావేత్త సీహెచ్ హనుమంత రావు, సాహితీవేత్త ప్రొఫెసర్ శివకుమార్ పేర్లను పంపినా వాటిని పక్కన పెట్టారు. రెండో లిస్టులో పీవీ నరసింహారావు పేరును ‘భారతరత్న’ పురస్కారానికి, జయశంకర్ పేరును పద్మవిభూషణ్ అవార్డుకు పంపారు. అలాగే తెలంగాణా కవులు గోరేటి వెంకన్న, అందె శ్రీ సుద్దాల అశోక్ తేజ, విద్యావేత్త చుక్కా రామయ్య పేర్లను తెలంగాణా సర్కార్ సిఫారసు చేసింది. కానీ వాటిని కూడా అవార్డుల ఎంపిక కమిటీ పక్కన పెట్టింది.

Share
Published by

Recent Posts

Naga Chaitanya’s Vrushakarma: Makers Playing with Fire?

Naga Chaitanya's Vrushakarma has reached a point where the silence itself is becoming a problem.…

26 minutes ago

బాలయ్య వారసత్వం మోక్షజ్ఞ చేతుల్లో… అసలు పరీక్ష మొదలు

నందమూరి బాలకృష్ణ అటు సినిమాల్లో, ఇటు రాజకీయాల్లో విజయవంతంగా కొనసాగుతున్నారు. హిందూపురం నుంచి వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. సీనియర్…

26 minutes ago