భారత్‌ పాలిట కరోనాలా పాక్.. టీకాలు తప్పవు

జమ్ము కశ్మీర్‌-వేర్పాటువాద సమస్యపై పెద్దగా ఆసక్తి చూపని భారతీయులు, ఉగ్రవాదులు పర్యాటకులపై కాల్పులు జరిపితే తీవ్ర భావోద్వేగంతో స్పందిస్తుండటం గమనిస్తే దేశ ఐక్యత, సమగ్రత పట్ల నిబద్దతకు నిదర్శనంగా కనిపిస్తోంది.

ఈ ఘటనపై భారతీయులు ఏవిదంగా స్పందిస్తున్నారో అందరికీ తెలుసు. కానీ పాక్ మీడియా మీడియా తమ దేశానికి అనుకూలంగానే స్పందిస్తుంది కనుక ప్రముఖ పాక్ ఆంగ్ల పత్రిక ‘డాన్’ ఈ పరిణామాలను తమ కోణంలోనే విశ్లేషించింది.

ADVERTISEMENT

ఉగ్రదాడి జరిగిన వెంటనే పాక్‌ని నిందించడం ఢిల్లీకి పరిపాటిగా మారింది. ఇప్పుడూ అదే చేస్తోంది. హడావుడిగా ఏదో అనాలి.. చేయాలి గాబట్టి చేస్తునట్లు ఉందే తప్ప ఈ సమస్య తాము సృష్టించుకున్నదే అని ఢిల్లీ గ్రహించడం లేదు.

కశ్మీర్‌ని భౌగోళికంగా విభజించడాన్ని వ్యతిరేకిస్తూ స్థానికంగా ఏర్పాటైన ‘ది రెసిస్టెన్స్ ఫ్రంట్’ అనే సంస్థకు చెందినవారు ఈ దాడికి పాల్పడితే వారు పాక్ ప్రేరిత ఉగ్రవాదులని ఢిల్లీ వాదిస్తోంది.

భారత్‌ అధీనంలో ఉన్న వివాదాస్పద కశ్మీర్‌లో ఢిల్లీ చేస్తున్న మిలటరీ దౌర్జన్యం పట్ల కాశ్మీరీలు వేసారిపోయారు. వారు తమకు స్వాతంత్ర్యం కావాలని పోరాడుతుంటే ఆర్మీ సాయంతో వారిని అణచివేయాలని ఢిల్లీ ప్రయత్నిస్తోంది.

కశ్మీర్‌ వివాదాన్ని సామరస్యంగా పరిష్కరించుకునేందుకు పాక్ ప్రభుత్వం ముందుకు వస్తున్నా ఢిల్లీ సహకరించడం లేదు. పైగా జమ్ము కశ్మీర్‌కి స్వాతంత్ర ప్రతిపత్తిని రద్దు చేసి మూడుగా విభజించిన తర్వాత జమ్ము కశ్మీర్‌లో శాంతి నెలకొందని ఢిల్లీ నమ్మబలుకుతోంది.

రాహుల్ గాంధీ వంటి ప్రతిపక్ష నాయకులు సైతం కశ్మీర్‌ విషయంలో ఢిల్లీ తీరుని తప్పు పడుతున్నారు. కానీ ఢిల్లీ తీరు మారలేదని తాజా ఆంక్షలు, బెదిరింపులు స్పష్టం చేస్తున్నాయి.

నిజనికి ఈ ఉగ్రదాడి కనువిప్పు వంటిదని భావించి ఢిల్లీ మేల్కొని భారత్‌ నుంచి స్వాతంత్ర్యం కోరుకుంటున్న కశ్మీరీలు-పాక్ ప్రభుత్వంతో సామరస్యంగా చర్చించి ఈ సమస్యని పరిష్కరించుకునే ప్రయత్నం చేయాలి. కానీ పాకిస్థాన్‌తో కయ్యానికి కాలు దువ్వుతోంది.

కనుక ఈ ఉద్రిక్తతలను తగ్గించేందుకు పాక్ ప్రభుత్వం ప్రయత్నిస్తూనే ఒకవేళ భారత్‌ దుందుడుకుగా వ్యవహరిస్తే ధీటుగా జవాబు చెప్పేందుకు సిద్దంగా ఉండాలి,” అని డాన్ పత్రిక ఓ కధనం ప్రచురించింది.

పాకిస్థాన్‌ నుంచి స్వాతంత్ర్యం కావాలని బలూచిస్తాన్ ప్రజలు దశాబ్ధాలుగా పోరాటాలు చేస్తున్నారు. అది పాక్ ప్రభుత్వానికి-వారికీ సంబందించిన సమస్య తప్ప భారత్‌ది కాదు.

అదేవిదంగా ఒకవేళ కశ్మీరీలు స్వాతంత్ర్యం కోరుకుంటే అది వారికీ-భారత్‌కు సంబందించిన సమస్య తప్ప దాంతో పాకిస్థాన్‌కి సంబంధం ఉండకూడదు. కానీ కశ్మీర్ ఓ అంతర్జాతీయ సమస్య, వివాదమని పాక్ వాదిస్తోంది. ఈ సమస్యని భారత్‌-పాక్ చర్చించుకొని పరిష్కరించుకోవచ్చని చెపుతోంది.

ఈ ఒక్క వాదనే పాక్‌ని పట్టిస్తోంది కదా?కశ్మీర్‌లో వేర్పాటువాదుల వెనుక, ఉగ్రవాదుల దాడుల వెనుక ఉన్నది తామేనని పాకిస్థాన్‌ స్వయంగా ధృవీకరిస్తోంది కదా?

అందుకే ఢిల్లీతో సహా యావత్ ప్రపంచ దేశాలు తమనే వేలెత్తి చూపిస్తున్నాయని పాక్‌ గ్రహిస్తే బాగుండేది. కానీ పాక్ ఓ తప్పుడు మార్గం ఎంచుకొని ముందుకు సాగుతూ తాను సమస్యలలో చిక్కుకుంటూ భారత్‌కి కూడా ఈవిదంగా సమస్యలు సృష్టిస్తోంది.

భారత్‌ పాలిట పాకిస్థాన్‌ కరోనా మహమ్మారి వంటిదే. దానికి ఎన్ని వ్యాక్సిన్లు వేసినా పూర్తిగా నివారించలేము. కనుక ఎప్పటికప్పుడు టీకాలు వేసుకుంటూ ఆత్మ రక్షణ చేసుకోవలసిందే.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

First Direction, Next Acting? Jason Sanjay in the Spotlight

Vijay’s son Jason Sanjay chose to make his entry into films as a director rather…

16 minutes ago

No Relief At Supreme, But AP Set For Poll Battle

A little over two years after the previous Assembly elections, Andhra Pradesh is preparing for…

47 minutes ago