
భారత్-పాకిస్థాన్ మద్య ఉద్రిక్తతలకు ప్రధాన కారణం జమ్ము కశ్మీర్‌లో ఉగ్రవాదులు 28 మంది పర్యాటకులను కాల్చి చంపడం.
కానీ ఇప్పుడు ఎవరూ వారి గురించి మాట్లాడటం లేదు. సోషల్ మీడియాలో సంతాప సందేశాలు, నేతలు, ప్రజల కొవ్వొత్తుల ర్యాలీల తర్వాత ఇప్పుడు అందరూ భారత్-పాకిస్థాన్ మద్య యుద్ధం గురించే మాట్లాడుకుంటున్నారు.
అవతల పాకిస్థాన్‌లో కూడా యుద్ధం గురించే మాట్లాడుకుంటున్నారు. ఇంకా చెప్పాలంటే తక్షణమే యుద్ధం ప్రారంభించేస్తే బాగుంటుందని పాక్ మంత్రులే తొందరపడుతున్నారు.
పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ ‘స్కై న్యూస్’కి ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో “అమెరికా, బ్రిటన్, పశ్చిమ దేశాల కోసమే మేము ఉగ్రవాదాన్ని పెంచి పోషించాము. అదే ఇప్పుడు మా కొంప ముంచుతోంది. అలాంటి పనులు చేయడం తప్పని ఇప్పుడు మాకు అర్దమయింది.
మేము ఉగ్రవాదానికి దూరంగా ఉండి ఉంటే, నేడు పాకిస్థాన్ పరిస్థితి మరోలా ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితి చెయ్యి దాటిపోయింది. ఇక ఇలాగే ముందుకు సాగాల్సి ఉంటుంది. మరో దారి లేదు,” అని అన్నారు.
మరో పాక్ మంత్రి హనీఫ్ అబ్బాసీ మాటలు విన్నప్పుడు ఈయన మంత్రా లేక ఆ ముసుగులో ఉన్న ఉగ్రవాదా? అనే సందేహం కలుగక మానదు. అచ్చం ఉగ్రవాదులా బెదిరింపు ధోరణిలో మాట్లాడారు.
ఆయన పాక్ మీడియాతో మాట్లాడుతూ, “పాకిస్థాన్ వద్ద ఒకటో రెండో కాదు.. 130 అణు బాంబులున్నాయి. అన్నిటినీ రహస్య ప్రాంతాలలో దాచి ఉంచాము. మన బాలిస్టిక్ క్షిపణులు ఘోరీ, ఘజ్నవీ, షహీన్ వంటివన్నీ రెడీగానే ఉన్నాయి. వీటన్నిటినీ భారత్‌పై ప్రయోగించుకే సిద్దం చేశాము తప్ప బల ప్రదర్శన కోసం కాదు.
భారత్ ఎటువంటి కవ్వింపు ప్రయత్నాలు చేసినా వాటిని ప్రయోగించడానికి వెనుకాడబోము. ఒకవేళ భారత్ సింధూ జలాలని నిలిపివేస్తే పూర్తిస్థాయి యుద్ధానికి సిద్దంగా ఉండాలి. భారత్‌కి మా తడాఖా ఏమిటో చూపుతాము.
రెండు రోజులు పాక్ గగనతలం మూసేస్తే భారత్ పౌర విమాన సంస్థలన్నీ గగ్గోలు పెట్టేస్తున్నాయి. మరొక్క పది రోజులు మూసి ఉంచితే చాలు అన్నీ దివాళా తీసి మూసుకుపోతాయి.
ఇప్పటికైనా భారత్ మమ్మల్ని బెదిరించే ప్రయత్నాలు మానుకుంటే మంచిది. లేకుంటే పర్యవసానాలు ఊహించని విధంగా ఉంటాయి. వాటికి మేము సిద్దమే. భారత్ సిద్దమేనా?” అని పాక్ మంత్రి హనీఫ్ అబ్బాసీ సవాలు విసిరారు.
పాకిస్థాన్ పాలకులు ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నారని, భారత్‌పై దాడులు చేయిస్తున్నారని పలు సందర్భాలలో ఐక్యరాజ్య సమితి సదస్సులో భారత్ వాదిస్తుంటుంది. అప్పుడు ఆ వాదనలను పాకిస్థాన్ తీవ్రంగా ఖండించినా, అవన్నీ నిజమేనని పాక్ మంత్రులు మాట్లాడుతున్న ఈ మాటలే స్పష్టం చేస్తున్నాయి కదా?
పాకిస్థాన్ వంటి అర్భకదేశానికే ఇంత మొండి ధైర్యం ఉంటే, దాని కంటే 100 రెట్లు అభివృద్ధి చెంది శక్తివంతంగా మారిన భారత్‌కి ఇంకెంత ధైర్యం ఉంటుంది?అని పాక్ పాలకులు ఎవరూ ఆలోచిస్తున్నట్లు లేదు.
అందుకే భారత్‌తో యుద్ధానికి ఉవ్విళ్ళూరుతూన్నారు. ఈ ఉద్రిక్తతలు వెంటనే తగ్గించే ప్రయత్నం చేయకుండా అణు బాంబులు, క్షిపణులతో భారత్‌పై దాడి చేస్తామని పాకిస్థాన్ యుద్ధానికి కవ్విస్తుండటం చూస్తుంటే వినాశకాలే విపరీత బుద్ధి అని అనిపించక మానదు. చివరికి ఏం జరుగుతుందో.. ఎలా ముగుస్తుందో?
A little over two years after the previous Assembly elections, Andhra Pradesh is preparing for…
Rashmika Mandanna’s absence from the Ranabaali trailer launch became one of the talking points of…