
దాదాపు నాలుగు దశాబ్దాలుగా కాశ్మీర్ పేరుతో వేర్పాటువాదులను ప్రోత్సహిస్తోంది పాకిస్తాన్. ఈ కారణంగా అందాల కాశ్మీర్ ఓ యుద్ధభూమిగా, అశాంతికి నిలయంగా మారింది.
నాలుగు దశాబ్దాలుగా పాకిస్తాన్ ఉగ్రవాదులను తయారుచేసి భారత్‌పై దాడులు చేయిస్తూనే ఉంది. ఈ దాడులలో వేలాదిమంది అమాయక ప్రజలు, మహిళలు, చిన్నారులు, సైనికులు, పోలీసులు, అధికారులు ప్రాణాలు కోల్పోతూనే ఉన్నారు.
ఆపరేషన్ సిందూర్ తర్వాత అయినా పాక్ బుద్ది తెచ్చుకుంటుందనుకుంటే, గత ఏడాది మళ్ళీ ఢిల్లీలో కారు బాంబు దాడి జరిగింది. దీని మూలాలు పాకిస్తాన్‌లోనే ఉన్నాయని నిఘా వర్గాలు నిర్ధారించాయి.
భారత్ పట్ల ఇంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నా భారత్ ఏనాడూ సంయమనం కోల్పోలేదు. కానీ ముల్లును ముల్లుతోనే తీయలన్నట్లు భారత్ కూడా ఇప్పుడు పాకిస్తాన్‌కు దాని పద్దతిలోనే తగిన విధంగా బుద్ధి చెపుతోంది… ఈ మాట భారత్ చెప్పుకోలేదు… పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ చెప్పుకున్నారు. సోషల్ మీడియాలో అయన ఓ పోస్ట్ పెట్టారు.
దానిలో “భారత్‌లో ఆఫ్ఘనిస్తాన్ ఓ కోలనీ (భాగమైనట్లు) వ్యవహరిస్తోంది. ప్రపంచంలో ఉగ్రవాదులందరినీ ఆఫ్ఘనిస్తాన్ ఒక్క చోట చేర్చి పాకిస్తాన్‌పై దాడులు చేస్తోంది. ఇరుగు పొరుగు దేశాలతో మేము సఖ్యత, శాంతినే కోరుకుంటాము. కానీ మాజోలికి వస్తే దీటుగా ఎదుర్కొంటాము. ఆఫ్ఘనిస్తాన్ భారత్ ప్రతినిధి అన్నట్లు వ్యవహరిస్తోంది. ఆఫ్ఘన్ దళాలను మా సైన్యం ధీటుగా ఎదుర్కొంటోంది,” అని ట్వీట్ చేశారు.
అంటే ఆఫ్గనిస్తాన్‌లోని తాలిబాన్లను భారతే వెనుకనుండి ప్రోత్సహిస్తోందని ఖవాజా ఆసిఫ్ అని ఆరోపిస్తున్నారన్న మాట! అయన ఆరోపిస్తున్నట్లు ఆఫ్ఘన్ వెనుక భారత్ ఉందా లేదా అనే విషయం పక్కన పెడితే, ఇప్పుడు తాలిబన్లు పాకిస్తాన్‌కు దాని పద్దతిలోనే ఇంత త్వరగా అర్ధమయ్యేలా చేయగలిగారు. కానీ తమకి భారత్ బుద్ధి చెపుతోందని పాక్ చెప్పుకుంటే పోయేది ఆయన పరువు… పాక్ పరువే కదా?
గత నాలుగు దశాబ్దాలుగా పాక్‌కు నచ్చజెప్పాలని భారత్ ఎంతగా ప్రయత్నించినా అర్థం చేసుకోలేదు. పాక్ పాక్ ప్రేరిత వేర్పాటువాదం, ఉగ్రవాదంతో భారత్ ఇంతకాలం ఎంతగా బాధపడిందో పాకిస్తాన్‌కు ఇప్పటికైనా అర్దమై తీరు మార్చుకుంటే మంచిది. లేకుంటే ఇలాంటి యుద్ధాలు చాలానే చేయాల్సి ఉంటుంది. వాటికి మూల్యం కూడా చెల్లించాల్సి వస్తుంది. ప్రతీసారి ట్రంప్ వచ్చి ఆదుకోడని, ఇలా యుద్ధాలు చేస్తుంటే మున్ముందు అప్పులు కూడా పుట్టవని, అప్పుడు పాకిస్తాన్ పరిస్థితి మరింత దయనీయంగా మారుతుందని ఎంత త్వరగా గ్రహిస్తే అంత మంచిది.
For the first time in Bigg Boss history, there is a double eviction in the…
Toxic has emerged as an epic disaster at the box office. While the movie bombed…