
అవును! పాకిస్తానే… ఇజ్రాయెల్‌కు వార్నింగ్ ఇచ్చింది. ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లోని పాక్ రాయబార కార్యాలయం సమీపంలో ఇజ్రాయెల్ దాడి చేసింది. ఆ దాడిలో పాక్ రాయబార కార్యాలయం పాక్షికంగా దెబ్బ తిన్నట్లు సమాచారం. దీనిపై పాక్ స్పందిస్తూ “మేము ఖతార్ మాదిరిగా కాదన్న విషయం బాగా గుర్తుంచుకోవాలి. మళ్ళీ ఇటువంటి పొరపాట్లు చేస్తే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి,” అని పాక్ హెచ్చరించింది.
అమెరికా, ఇజ్రాయెల్ దళాలు కలిసి దాదాపు నెలరోజులుగా ఇరాన్ మీద దాడులు చేస్తూనే ఉన్నాయి. ఇజ్రాయెల్ సాంకేతిక పరిజ్ఞానం, ఆయుధ సంపత్తి, విమానాలతో పోలిస్తే పాక్ ఏమాత్రం సరితూగలేదు. పైగా ఇజ్రాయెల్‌ని టచ్‌లో ఉన్నారు. చేస్తే అమెరికా ఊరుకోదు. ఇజ్రాయెల్ కోసమే అమెరికా ఈ అనవసరమైన యుద్ధంలో దిగింది. భారత్ ‘ఆపరేషన్ సిందూర్’తో యుద్ధానికి వస్తే అమెరికాని వేడుకొని బయటపడిన పాక్, సర్వశక్తివంతమైన ఇజ్రాయెల్‌ని బెదిరించడం చాలా హాస్యాస్పదంగా ఉంది. ఓ పక్క అమెరికా-ఇరాన్ మద్య రాజీ కుదిర్చి శాంతి చర్చలు జరిపేందుకు ప్రయత్నిస్తున్న పాక్, ఇజ్రాయెల్‌తో కయ్యానికి కాలు దువ్వితే ఏమవుతుంది?
ప్రపంచం సంక్షోభం దిశగా అడుగులు వేయబోతుంది, ప్రస్తుతం ప్రపంచం చూస్తున్న ఈ సంక్షోభ పరిస్థితులు ఇలానే కొనసాగితే చాలామంది పేదరికంలో…
After the disastrous performance of Ustaad Bhagat Singh, Pawan Kalyan fans have been eagerly waiting…