
జయలలిత నెచ్చెలి శశికళ చేతికి ప్రభుత్వం చిక్కడంతో కనీసం రెండాకుల గుర్తునైనా తాను దక్కించుకోవాలని పన్నీర్ సెల్వం పట్టుదలగా ఉన్నారు. ఇందుకు సంబంధించిన వ్యూహ, ప్రతి వ్యూహాల్లో మునిగి తేలుతున్నారు. ఈ విషయమై ఇప్పటికే ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. తమ వద్ద ఉన్న ఆధారాలను, రికార్డులను పన్నీర్ వర్గం ఇప్పటికే సీఈసీకి సమర్పించింది.
అయితే చిన్నమ్మ శిబిరం కూడా ఈ విషయంలో సీఈసీకి వివరణలు ఇచ్చింది. తమ వద్ద ఉన్న ఆధారాలను సమర్పించింది. జయ మరణంతో ఖాళీ అయిన ఆర్కేనగర్ లో వచ్చే నెలలో ఉప ఎన్నిక జరగనున్న నేపథ్యంలో ‘రెండాకుల’ను దక్కించుకునేందుకు ఎవరికి వారే పోటీ పడుతున్నారు. ఈ నేపథ్యంలో సీఈసీ నుంచి ఎలాంటి నిర్ణయం వెలువడుతుందో, రెండాకులు ఎవరికి దక్కుతాయో అన్న ఉత్కంఠ నెలకొంది.
మాజీ మంత్రి, మండలిలో వైసీపీ పక్ష నాయకుడు బొత్స సత్యనారాయణ త్వరలో వైసీపీకి గుడ్ బై చెప్పేసి సకుటుంబ సమేతంగా…
The inevitable has happened as Konda Surekha has been removed from the Telangana cabinet by…