
ఏపీలో సంచలనం రేపిన పాస్టర్ ప్రవీణ్ మరణ వార్త క్రైస్తవ భక్తులలో తీవ్ర విషాదాన్ని నింపిందనే చెప్పాలి. దీనితో ప్రవీణ్ మరణం పై ఏపీలో రాజకీయం మొదలయ్యింది. పాస్టర్ ను ఎవరో ఉద్దేశపూర్వకంగానే అంతమొందించారని, ఇందులో కుట్ర కోణం దాగుందంటూ ప్రచారాలు ఊపందుకున్నాయి.
అయితే వీటి మీద సమగ్ర విచారణ చేపట్టిన అధికారులు పాస్టర్ మృతి పై వాస్తవాలను శోధించే పనిలో పడ్డారు. అందుకుగాను పాస్టర్ హైద్రాబాద్ టూ రాజమండ్రి జర్నీ సీసీ టీవీ ఫోటేజ్లను బయటపెట్టారు. హైద్రాబాద్ నుంచి బులెట్ మీద రాజమండ్రికి బయలుదేరిన ప్రవీణ్ కోదాడలో ఒక వైన్ షాప్ వద్ద ఆగి మద్యం కొనుగోలు చేసినట్లు సీసీ టీవీ లో రికార్డు అయ్యింది.
ఇక, కంచికచర్ల, పరిటాల మధ్య ప్రవీణ్ బులెట్ అదుపు తప్పి కింద పడిపోవడంతో ఆయన చేతికి గాయమైనట్టు తెలుస్తుంది, అలాగే పాస్టర్ బులెట్ కూడా పాక్షికంగా డామేజ్ అయ్యింది. ఇక అక్కడ నుంచి గొల్లపూడి చేరుకున్న ప్రవీణ్ సదరు పెట్రోల్ బంక్ లో పెట్రోల్ కొట్టించుకుని సుమారు 800 రూ. ఫోన్ పే చేసినట్టు ఆధారాలను సేకరించారు అధికారులు.
ఇక అక్కడి నుంచి విజయవాడ చేరుకున్న ప్రవీణ్ రామవరప్పాడు రింగ్ సమీపంలో మరోమారు తన బులెట్ పై నుండి కిందకు పడినట్లు గుర్తించారు పోలీసులు. అయితే ఈ మొత్తం ఎపిసోడ్ లో ఆయన మద్యం మత్తులో ఉన్నట్టు స్థానిక విధులు నిర్వహించే పోలీస్ అధికారులు ధ్రువీకరించారు. దీనితో ఆయన ను బులెట్ పై జర్నీ చేయవద్దంటూ అధికారులు వారించినా ప్రవీణ్ మాత్రం అక్కడ దగ్గర లో ఉన్న పార్క్ లో కాసేపు విశ్రాంతి తీసుకుని తిరిగి తన ప్రయాణాన్ని కొనసాగించినట్టు సమాచారం.
అయితే ఇదంతా కూడా విజయవాడ నోవాటెల్ హోటల్ సీసీ టీవీ కెమెరాలో రికార్డు అయినట్లు వీడియో ఫోటోజలను గుర్తించారు పోలీసులు. దీనితో పాస్టర్ మరణం పై మొదలైన హత్య రాజకీయ ఆరోపణలకు చెక్ పడినట్లయింది. ఈ మృతి పై విచారణ చేపట్టిన పోలీస్ అధికారులు దీనిని చేధించేందుకు సుమారు 300 లకు పైగా ఉన్న సీసీటీవీ ఫోటోజ్ లను పరిశీలించినట్లు తెలుస్తుంది.
మీడియాలో ప్రత్యక్షమైన ఈ సీసీ టీవీ ఫోటోల ఆధారంగా పాస్టర్ ప్రవీణ్ మరణం చుట్టూ అల్లుకున్న చిక్కుముడులన్నీ కూడా ఒక్కొక్కటిగా వీడిపోయినట్లు తెలుస్తుంది.
The elections to the Telugu Film and TV Dancers and Dance Directors Association will not…
Andhra Pradesh chief minister Chandrababu Naidu is currently serving his fourth term in the office…