
ఒక మిషన్ లో పట్టుబడి మూడేళ్లు గా కనపడకుండా పోయిన పఠాన్ ని, ఇండియన్ రా టీం వెతుకుతూ ఉంటుంది. నేను బతికే ఉన్నాను అని షారుఖ్ చెప్పిన డైలాగ్, తరవాత నవ్విన నవ్వు అభిమానులను ఆకట్టుకుంది. షారుఖ్ గెటప్ చూస్తే హ్యాపీ న్యూ ఇయర్ సినిమా గుర్తొస్తుంది. ఫైట్స్ ఆకట్టుకుంటాయి. చాలా ఖర్చు పెట్టి సినిమా తీశారు. సంచిత్-అంకిత్ నేపథ్య సంగీతం స్టైలిష్ గా ఉంది.
ఈ టీజర్ చూసాక, పఠాన్ మరో ధూమ్ లాంటి స్టైలిష్ యాక్షన్ సినిమా కాబోతుందని అర్ధం అవుతుంది. టీజర్ లో చూపించిన షాట్స్ అన్నీ దర్శకుడు సిద్దార్థ్ ఆనంద్ ముందు సినిమాలైన బాంగ్ బాంగ్, వార్ సినిమాల్లో చూసినట్లే అనిపిస్తాయి. గ్రాఫిక్స్ అయితే తక్కువ క్వాలిటీ తో ఉన్నాయి. ముఖ్యంగా మంచుకొండల్లో, ఐస్ ల్యాండ్ మీద తీసిన యాక్షన్ సన్నివేశాలు హ్రితిక్ నటించిన వార్ సినిమాని గుర్తు చేస్తాయి. ఎదో కొత్తదనం ఉంటుందని ఆశించే అభిమానులకి ఈ టీజర్ ఏమంత కిక్ ఇవ్వదు. ఇక తెలుగు టీజర్ లో డబ్బింగ్ అయితే గూగుల్ ద్వారా తెలుగులోకి తర్జుమా చేసి డైలాగ్స్ రాసినట్లు, పలికినట్లు ఉన్నాయి. యాష్ రాజ్ సంస్థ పాత తెలుగు డబ్బింగ్ సినిమాల పరిస్థితి కూడా ఇదే.
అసలే బాలీవుడ్ పరిస్థితి అంతంతమాత్రంగా ఉంది. చాలా ఏళ్లుగా హిట్ మొహం చూడని షారుఖ్ కి ఈ పఠాన్ సినిమా విజయం ఎంతో అవసరం. కథలో కొంతైనా కొత్తదనం లేకుండా ఈ రోజుల్లో సినిమా విజయం సాధించడం అసాధ్యం. సిద్దార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించిన సినిమాలన్నీ యావరేజ్ సినిమాలే. ఈ పఠాన్ సినిమా జనవరిలో హిందీ, తెలుగు, తమిళ భాషల్లో విడుదల కాబోతుంది. షారుఖ్ ఈ సారైనా హిట్ కొట్టి అభిమానులను అలరిస్తాడని ఆశిద్దాం. హ్యాపీ బర్త్ డే టూ షారుఖ్ ఖాన్.
Former MP Vijayasai Reddy has launched a sharp attack on the TDP-led alliance and YSRCP…
Andhra Pradesh needs a strong opposition to question the TDP-led government and hold it accountable.…