
తన తండ్రి అల్లు అరవింద్ తో సహా హాజరైన అల్లు అర్జున్ కు ‘పవన్ తో మాట్లాడాల్సిందిగా’ పలువురు సినీ ప్రముఖులు కూడా సలహా ఇచ్చినప్పటికీ, వాటిని కూడా బన్నీ పెడచెవిన పెట్టడం వలనే ఈ సమాచారం బయటకు లీక్ అయ్యిందని ఈ వార్తల సారాంశం. మెగా కాంపౌండ్ నుండి వచ్చిన ఈ ఇద్దరూ ఎడమొహం పెడమొహంగా వ్యవహరించడం అనేది టాలీవుడ్ వర్గాల్లో కూడా హాట్ హాట్ చర్చలకు తెరలేపింది. దీంతో ఉద్దేశపూర్వకంగానే నాడు బన్నీ ‘చెప్పను బ్రదర్’ అన్నారంటూ, పవన్ విషయంలో కొంతమేర అసంతృప్తిగా ఉన్నట్లు జరుగుతున్న ప్రచారంలో ఎంత వాస్తవం ఉందో తెలియాల్సి ఉంది.
అయితే నిజంగా పవన్ కు వ్యతిరేకంగా బన్నీ వ్యవహరించే అవకాశం ఉందా? అంటే లేదనే చెప్పాలి. మరి బన్నీ కనపడిన ప్రతిసారి ఎందుకు ఇంత రాద్ధాంతం జరుగుతోంది? అంటే దానికి ఉన్న ఒకే ఒక్క సమాధానం ‘మెగాస్టార్.’ రాజకీయంగా చిరంజీవికి వ్యతిరేకంగా పవన్ ‘నినాదం’ తీసుకోవడం, బహుశా బన్నీని హర్ట్ చేసి ఉండవచ్చనే టాక్ వినపడుతోంది. ఒకప్పుడు మెగాస్టార్ ఎంతో పవర్ స్టార్ కూడా అంతేనన్న రీతిలో వ్యాఖ్యానించిన అల్లు అర్జున్ స్వరంలో ఇటీవల స్పష్టమైన మార్పు వచ్చి, అందరి కంటే ‘మెగాస్టారే’ గొప్ప అంటూ ఒక మెట్టు పైకెక్కించారు.
సరే… బన్నీ పలకరించకపోయినా పవన్ అయినా పలకరించవచ్చు కదా? అన్న ప్రశ్నకు సమాధానం ‘అల్లు అరవింద్’ అని వ్యక్తమవుతోంది. మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ కు, పవన్ కళ్యాణ్ కు మొదట నుండి పెద్దగా సత్సంబంధాలు లేవన్న విషయం ఇండస్ట్రీ వర్గాలు ఎప్పుడూ చెప్తుంటాయి. ‘ప్రజారాజ్యం’ విలీనంలో కూడా అరవింద్ పాత్ర కీలకంగా మారిన నేపధ్యంలో, అప్పుడు కూడా పవన్ కళ్యాణ్ తీవ్రంగా విభేదించారని సందడి చేసిన వార్తల గురించి తెలిసిందే.
అలాంటి అరవింద్ ను పక్కన ఉన్న బన్నీని పలకరించి, అరవింద్ ను విస్మరించడం సమంజసం కాదు కాబట్టి, పవన్ ఎవరితోనూ మాట్లాడకుండా వెళ్ళిపోయారేమో? అదీ కాకపోతే బన్నీ చెప్పిన ‘చెప్పను బ్రదర్’ అన్న మాట నిజంగానే పవన్ ను హర్ట్ అయ్యేలా చేసిందేమో? ఏది ఏమైనా నాడు బన్నీ రేపిన ‘చెప్పను బ్రదర్’ పర్యవసానాలు సాధారణంగా లేవని, అవకాశం వచ్చినప్పుడల్లా ఈ అంశం తెరపైకి వచ్చి మెగా కాంపౌండ్ ను అతలాకుతలం చేస్తోందని టాలీవుడ్ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి.
Varun Dhawan’s films have not worked big at the box office over the last few…
BOTTOM LINE Painfully Boring RATING 1.75/5 Story, Screenplay, Director: Nishanth Doti Cast: Shiva Kumar Kasaram,…