Telugu

ఇందులో పవన్ కళ్యాణ్ వెనక్కి తగ్గరు!

పార్టీ పెట్టిన నాటి నుండి రాజకీయాలను పూర్తి స్థాయిలో పట్టించుకోవట్లేదని ఆరోపణలు ఎదుర్కొంటున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కొన్ని విషయాలలో మాత్రం వెనువెంటనే స్పందిస్తుంటారు. అలాగే చాలా పరిణితి చెందిన వ్యక్తిగా పవన్ కళ్యాణ్ వివరణ ఉండడం గమనించదగ్గ అంశం.

తాజాగా నేడు ఏపీ అసెంబ్లీలో చోటు చేసుకున్న ఘటనను ఖండిస్తూ ప్రెస్ నోట్ రిలీజ్ చేసారు. మహిళలపై అసభ్యత జనసేన ఎన్నటికీ ఆహ్వానించదని, చంద్రబాబు కుటుంబంపై అధికార పక్షం చేసిన కామెంట్స్ శోచనీయమని, ఇది ప్రజలలో రాజకీయాలపై ఏహ్యభావనను కలిగిస్తాయని అన్నారు.

ADVERTISEMENT

వ్యక్తిగత దూషణలకు మొదటి నుండి పవన్ కళ్యాణ్ దూరంగా ఉంటారు. గతంలో పవన్ ముగ్గురి భార్యల అంశాన్ని లేవనెత్తుతూ జగన్ చేసిన కామెంట్స్ మరియు అందుకు పవన్ కళ్యాణ్ స్పందించిన వీడియోను ఈ సందర్భంగా జనసైనికులు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by
Tags: cross link

Recent Posts

కిందపడ్డా పైచేయి నాదే.. వైసీపీ వింత వాదన!

2024 సార్వత్రిక ఎన్నికలలో ఘోర పరాజయం.. తాజాగా స్థానిక ఎన్నికల్లోనూ ఎదురుదెబ్బలు..వైసీపీ రాజధాని విశాఖ లోనూ పార్టీ భూస్థాపితం, జగన్…

44 minutes ago

Only Five Pairs! The Secret Behind Pawan’s Balu Pants

Pawan Kalyan’s style in Balu was not something that happened by accident. Behind that effortlessly…

54 minutes ago