
YSRCP's Political Strategy Tests TDP
2024 సార్వత్రిక ఎన్నికలలో ఘోర పరాజయం.. తాజాగా స్థానిక ఎన్నికల్లోనూ ఎదురుదెబ్బలు..వైసీపీ రాజధాని విశాఖ లోనూ పార్టీ భూస్థాపితం, జగన్ మావిగన్‌లోనూ ప్రజల తిరస్కరణ.. అయినా కూడా వైసీపీ తీరు మారడం లేదు. ప్రజల నుంచి వైసీపీ కి రాజకీయంగా వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నా అమరావతిపై మాత్రం వైసీపీ శ్రేణుల విమర్శల దాడి ఆగడం లేదు.
తాజాగా ఏపీని అల్లడిస్తున్న మురస తుఫాను ప్రభావంతో పలుజిల్లాలు వరద ముంపుకి గురయ్యాయి. వందలాది ఎకరాలలో పంట నీట మునిగింది. వేలాదిమంది ప్రజలు వరద ముంపుతో సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లారు. ఇటు ప్రభుత్వం కూడా అవసరమైన అత్యవసర సదుపాయాలను అందుబాటులో ఉంచుతూ ప్రాణ నష్టాన్ని నివారించే చర్యలు చేపట్టింది.
ఇటువంటి సమయంలో రాజకీయాలకు అతీతంగా వ్యవహరించవల్సిన రాజకీయ పార్టీలు, ఆయా పార్టీల నేతలు ఇప్పుడు కూడా రాజకీయం చేస్తూ ఏకంగా రాష్ట్ర రాజధాని అమరావతి పై మరోసారి తమ విషాన్ని కక్కుతున్నారు. తుఫాన్ ప్రభావంతో అనేక ప్రాంతాలు నీట మునిగాయి. కుండపోత వర్షాల కారణంగా రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయి.
ఇటువంటి పరిస్థితులలో నిర్మాణ దశలో ఉన్న అమరావతి లో కూడా తుఫాన్ ప్రభావం కనిపిస్తుంది. ఇక ఇదే అదును అన్నట్టుగా వైసీపీ అమరావతి మునిగిపోయింది, అమరావతి వంటి ఒక వరద ప్రాంతాన్ని రాజధానిగా ఎలా ప్రకటిస్తారు.? అక్కడ నిర్మాణాలు ఎలా చేపడతారు.? అంటూ వైసీపీ శ్రేణులు, ఆ పార్టీ మద్దతుదారులు సోషల్ మీడియాలో పోస్ట్ లు చేస్తూ అమరావతి పై మరోసారి రాజకీయ దాడి మొదలుపెట్టారు.
తాజా ఎన్నికల ఫలితాలు వైసీపీకి ప్రజల్లో ఉన్న ప్రస్తుత రాజకీయ పరిస్థితిని స్పష్టం చేస్తున్నాయి. ఒకప్పుడు 13కి 13 కార్పొరేషన్లను గెలుచుకున్న పార్టీ.. ఇప్పుడు స్థానిక ఎన్నికల్లో కూటమి ఆధిపత్యం ముందు తలవంచవలసి వచ్చింది. చివరికి జగన్ పులివెందులలో కూడా టీడీపీ విజయాన్ని వైసీపీ ఆపలేకపోయింది.
అమరావతిని కాదని జగన్ ప్రతిపాదించిన మావిగన్ ప్రాంతాల్లోనూ ప్రజలు వైసీపీకి రాజకీయంగా కోలుకోలేని విధంగా దెబ్బకొట్టారు. అయినప్పటికీ అమరావతి విషయంలో వైసీపీ తన పాత వాదనలనే కొనసాగిస్తుండడంతో ‘కింద పడ్డా పై చెయ్యి నాదే’ అన్న తరహాలో వైసీపీ వ్యవహరిస్తోంది అన్న విమర్శలు ఎదుర్కొటుంది.
రాజధాని నిర్మాణం, అభివృద్ధి, పెట్టుబడులపై నిర్మాణాత్మక చర్చ చేయాల్సిన సమయంలో తుఫాను కారణంగా కురిసిన భారీ వర్షాలను కూడా రాజకీయ ప్రచారానికి ఉపయోగించుకోవడం ఎంతవరకు సమంజసం? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
ప్రజా తీర్పును గౌరవించకుండా ప్రతిసారి తమ వాదనే సరైనదని సమర్ధించుకోవడం కోసం వైసీపీ పడుతున్న రాజకీయ తపన వైసీపీ పార్టీకి ఏమేరకు రాజకీయ లబ్ది చేకూరుస్తుంది.? రాజకీయాలలో ఓటమి అందునా ఈ స్థాయి ఘోర పరాజయం ఎదురైనప్పుడు ప్రత్యర్థి పార్టీల మీద ఎదురుదాడి కాకుండా ఆత్మపరిశీలిన చేసుకోవడం వైసీపీ భవిష్యత్ రాజకీయానికి ఎంతైనా అవసరం సుమీ…!
Pawan Kalyan’s style in Balu was not something that happened by accident. Behind that effortlessly…
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జనసేన పార్టీ మరోసారి తనదైన ముద్ర వేసింది. 2024 సార్వత్రిక ఎన్నికల్లో నూటికి నూరు శాతం స్ట్రైక్…