Telugu

గిద్దలూరు టిడిపి, జనసేన అభ్యర్ధులు ఖరారు!

టిడిపి, జనసేనలు పొత్తులు పెట్టుకొంటాయో లేదో తేల్చకుండా వైసీపీని ఒకటే టెన్షన్ పెట్టేస్తున్నాయి. అవి ఖచ్చితంగా కలిసే పోటీ చేస్తాయని వైసీపీ నేతలు గట్టిగా వాదిస్తున్నారు. ఒకవేళ పొత్తులు పెట్టుకొనే మాటైతే టిడిపి, జనసేనలు ముందుగా అధికారిక ప్రకటన చేసి, తర్వాత సీట్ల సర్దుబాట్ల గురించి చర్చించుకొని, ఏ జిల్లాలో ఎక్కడెక్కడ ఎన్ని సీట్లకు పోటీ చేయాలో నిర్ణయించుకోవలసి ఉంటుంది.

కానీ ఓపక్క చంద్రబాబు నాయుడు, నారా లోకేష్‌ టిడిపి అభ్యర్ధులను ఖరారు చేసి ప్రకటించేస్తుంటే, మరోపక్క పవన్‌ కళ్యాణ్‌ కూడా జనసేన అభ్యర్ధులను ఖరారు చేసేస్తున్నారు. తాజాగా ప్రకాశం జిల్లాలోని గిద్దలూరు నియోజకవర్గం నుంచి ఆమంచి స్వామికి పవన్‌ కళ్యాణ్‌ టికెట్‌ ఖరారు చేసేశారు. ఈ విషయం ఆయనే స్వయంగా తెలిపారు.

ADVERTISEMENT

చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ అన్నయే ఆమంచి స్వామి. ఇదివరకు కృష్ణ మోహన్ టిడిపిలోనే ఉండేవారు. కానీ గత ఎన్నికలలో టికెట్‌ లభించకపోవడంతో 2019, ఫిభ్రవరిలో వైసీపీలో చేరారు. ప్రస్తుతం పర్చూరు వైసీపీ నియోజకవర్గం ఇన్‌ఛార్జ్‌గా ఉన్నారు.

2009,2014లో తమ్ముడు చీరాల నుంచి తమ్ముడు ఎమ్మెల్యేగా గెలిచేందుకు ఆమంచి స్వామి ఎంతగానో సహాయపడ్డారు. ఇప్పుడు తమ్ముడు వైసీపీలో ఉన్నాడు కనుక ఆయన కూడా వైసీపీలోకి వెళతారనుకొంటే ఈ నెల 15న తాను జనసేన పార్టీలో చేరబోతున్నట్లు ప్రకటించారు. అంతేకాదు… తాను గిద్దలూరు నుంచి జనసేన అభ్యర్ధిగా పోటీ చేయబోతున్నానని, అందుకు పవన్‌ కళ్యాణ్‌ కూడా ఓకే చెప్పేశారని తెలిపారు. అంటే ఆ షరతు మీదే ఆయన జనసేనలో చేరుతున్నట్లు భావించవచ్చు.

తమ్ముడు ఆమంచి కృష్ణమోహన్ వైసీపీ తరపున పర్చూరు నుంచి పోటీ చేయబోతుంటే, అన్న అమంచి స్వామి జనసేన నుంచి పోటీ చేస్తుండటం ఆశ్చర్యకరం.

మరోవిషయం ఏమిటంటే, ఇటీవల చంద్రబాబు నాయుడు గిద్దలూరులో పర్యటించినప్పుడు గత ఎన్నికలలో వైసీపీ అభ్యర్ధి అన్నా వెంకట రాంబాబు చేతిలో ఓడిపోయిన ముదుముల అశోక్ రెడ్డినే టిడిపి నియోజకవర్గం ఇన్‌ఛార్జ్‌గా నియమించారు. అంటే అక్కడి నుంచి మళ్ళీ ఆయనే టిడిపి అభ్యర్ధిగా పోటీ చేయబోతున్నారని అర్దమవుతోంది.

జనసేన అభ్యర్ధిగా ఆమంచి స్వామి, టిడిపి అభ్యర్ధిగాఅశోక్ రెడ్డి, వైసీపీ అభ్యర్ధిగా అన్నా రాంబాబు గిద్దలూరు నుంచి పోటీ పడితే, అప్పుడు వైసీపీ కోరుకొంటున్నట్లుగానే ముక్కోణపు పోటీ జరిగి ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలిపోవడం ఖాయం. ఆవిదంగా జరగకుండా చూస్తానని పవన్‌ కళ్యాణ్‌ పదేపదే చెపుతున్నారు కదా?మరేం చేస్తారో?ఎవరు వెనక్కు తగ్గుతారో?

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Tollywood Burning Crores on Scenes Nobody Will Ever See

Tollywood is spending hundreds of crores on big films, but poor planning is creating a…

29 minutes ago

Bollywood Divided As Imran Khan Faces Exit Notice

Actor Imran Khan being asked to leave India has drawn mixed reactions from the film…

54 minutes ago