పవన్ కళ్యాణ్ అంత డేరింగా? అంత సీన్ ఉందా?

Pawan Kalyan Bheemla Nayak Release Dateపవన్ కళ్యాణ్ అభిమానులకు ఈరోజు భీమ్లా నాయక్ టీం అనుకోని ఒక సర్ప్రైస్ ఇచ్చింది. ఈ నెల 15న తమ చిత్రంలోని అంతఇష్టం అనే పాట ను విడుదల చెయ్యబోతున్నట్టు ప్రకటించింది చిత్రబృందం.

ADVERTISEMENT

ఇది పవన్ కళ్యాణ్, నిత్యామీనన్ ల మీద వచ్చే పాట. ఈ సర్ప్రైస్ మాట అటుంచితే ఆ పాటకు సంబంధించిన పోస్టర్ మీద ‘రిపోర్టింగ్ జనవరి 12, 2022’ అని రాసి ఉంది. ఇప్పుడు ఆ విషయం చర్చనీయాంశం అవుతుంది.

రెండు రోజుల క్రితం రాజమౌళి తన ఆర్ఆర్ఆర్ జనవరి 7, 2022న విడుదల అవుతుందని ప్రకటించారు. దానితో భీమ్లా నాయక్, సర్కారు వారి పాట వాయిదా ఖాయమని వార్తలు వచ్చేశాయి. అయితే అదేమీ కాదు అన్నట్టు ఉంది ఈ పోస్టర్.

రాజమౌళి సినిమా విడుదలైన ఐదో రోజు సినిమా వెయ్యడం అంటే మాటలు కాదు. అంత డేర్ చేస్తుందా చిత్రబృందం అనేది చూడాలి. అయితే ఇప్పుడు ఇలాగే చెప్పి చివర్లో వాయిదా వేస్తారని అనుకుంటున్నారు చాలా మంది.

కొంతమంది అయితే ఒకవేళ ఎప్పటిలానే రాజమౌళి సంక్రాంతికి మిస్ కొడితే ఆ డేట్ పోనివ్వకుండా ఇలా సెట్ చేస్తున్నారేమో అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే దగ్గరకు వస్తే తప్ప దాని మీద మనకు ఒక క్లారిటీ రాదు.

ADVERTISEMENT
Latest Stories