
పవన్ కళ్యాణ్ సినిమా డైలాగ్ ‘ఎక్కడ నెగ్గాలో కాదు.. ఎక్కడ తగ్గాలో కూడా తెలిసినవాడు’.. దీనిని రాజకీయాలలో కూడా చక్కగా పాటిస్తూ దూసుకుపోతున్నారు.
టీడీపీతో పొత్తుల విషయంలో చొరవ తీసుకొని ఖాయం చేశారు. వాటిని చెడగొట్టేందుకు జగన్మోహన్ రెడ్డి ‘మూడు పెళ్ళిళ్ళు’ అంటూ ఎంత రెచ్చగొట్టినా పవన్ కళ్యాణ్ వెనక్కు తగ్గలేదు.
తాను అధికారంలోకి వచ్చాను కనుక వైసీపీపై ప్రతీకారం తీర్చుకోవాలని అనుకోవడం లేదని పవన్ కళ్యాణ్ చెప్పగా, సిఎం చంద్రబాబు నాయుడు కూడా శాంతి, సంయమనం పాటించేవారు.
కానీ ఎన్నికలలో ఓటమి తర్వాత కూడా వైసీపీ చెలరేగిపోతుంటే అదే పవన్ కళ్యాణ్ ఏపీలో పోలీస్ శాఖ ఏం చేస్తోంది? హోంమంత్రి ఏం చేస్తున్నారు?అంటూ నిలదీసి అందరినీ పరుగులు పెట్టించారు.
అప్పటి నుంచే వర్మ, పోసానీతో సహా వైసీపీ సోషల్ మీడియాపై కూటమి ప్రభుత్వం దండయాత్రలు మొదలయ్యాయి. కానీ అంత మాత్రాన్న పవన్ కళ్యాణ్ గర్వంతో విర్రవీగలేదు.
సిఎం చంద్రబాబు నాయుడు, హోంమంత్రి అనిత వంగలపూడికి తాను ఆవిదంగా ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందో మర్యాదపూర్వకంగా వివరించి వారితో యధాప్రకారం కలిసిమెలిసి పనిచేస్తున్నారు.
సనాతనధర్మ పరిరక్షణ అంటూ కాషాయ వస్త్రాలు ధరించినంత మాత్రాన్న సాధువుగా మారిపోలేదంటూ కాకినాడ పోర్టు మీద దండయాత్ర చేసి వైసీపీ నేతల అక్రమ బియ్యం రవాణా వ్యవహారాన్ని బయటపెట్టారు. తద్వారా వైసీపీ అవినీతి, అక్రమాలు జాతీయస్థాయి దాటి అంతర్జాతీయ స్థాయికి చేరుకున్నాయని చాటి చెప్పగలిగారు.
పోర్టు నుంచి నిర్భయంగా బహిరంగంగా రేషన్ బియ్యం విదేశాలకు రవాణా చేయగలుగుతున్నప్పుడు, గంజాయి, మాదక ద్రవ్యాలు, ఆయుధాలు వగైరా చేయలేరా? దిగుమతి చేసుకోలేరా?ఇది జాతీయ భద్రతకు సంబందించిన అంశం అంటూ పవన్ కళ్యాణ్ చెప్పిన మాటలు అందరినీ ఆలోచింపజేస్తాయి.
పవన్ కళ్యాణ్ సూచన పాటించి సముద్రతీరం కలిగిన ప్రతీ రాష్ట్రం ఈ కోణంలో ఆలోచించి, ఇటువంటి అక్రమాలను అరికట్టేందుకు పటిష్టమైన చర్యలు చేపడితే చాలా మంచిది. ఇతర రాష్ట్రాల సంగతి ఎలా ఉన్నా, ఏపీ ప్రభుత్వం మాత్రం తక్షణమే స్పందిస్తూ మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేసింది.
పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు, ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్, పోలీస్, రవాణా, పౌరసరఫరాల శాఖ, మారిటైం బోర్డు అధికారులు నిన్న సచివాలయంలో సమావేశమై బియ్యం అక్రమ రవాణాని కాకినాడ పోర్టుతో సహా రాష్ట్రంలో ఇతర పోర్టులలో ఇటువంటి అక్రమ రవాణాను అరికట్టడానికి తీసుకోవలసిన చర్యలు, అక్రమ రవాణా మూలాలను గుర్తించడం, అడ్డుకోవవడం, తదితర అంశాలపై సుదీర్గంగా చర్చించారు. దీనిని వ్యవస్థీకృత నేరంగా పరిగణించి బాధ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని నిర్ణయించారు.
నిజానికి మంత్రి నాదెండ్ల మనోహర్ రెండు మూడు నెలల క్రితమే ఈ బియ్యం అక్రమ రవాణా వ్యవహారాన్ని బయటపెట్టారు. కానీ కాకినాడ పోర్టు నుంచి బియ్యం రవాణాని అడ్డుకోవడం ఆయన వల్ల కాలేదు. అందువల్లే పవన్ కళ్యాణ్ రంగంలో దిగవలసి వచ్చింది.
ఉప ముఖ్యమంత్రినైన తనని కూడా పోర్టు సిబ్బంది అడ్డుకునేందుకు విశ్వప్రయత్నాలు చేశారని పవన్ కళ్యాణ్ చెప్పారు. అంటే అది కాకినాడ పోర్టు కాదు అతిపెద్ద ‘మాఫియా డెన్’లా మారిందన్న మాట. అటువంటి ‘డెన్’లో పవన్ కళ్యాణ్ రియల్ లైఫ్ హీరోలా అడుగుపెట్టి విలన్ గ్యాంగ్‌లను ఒంటి చేత్తో ఊచకోత కోశారు.
పవన్ కళ్యాణ్ బియ్యం అక్రమ రవాణాపై యుద్ధం ప్రకటించగానే చకచకా చర్యలు మొదలయ్యాయి. కనుక ఎక్కడ తగ్గాలో కాదు.. ఎక్కడ నెగ్గాలో కూడా పవన్ కళ్యాణ్ బాగానే తెలుసుకున్నారని చెప్పొచ్చు.
Mamitha Baiju is going great guns in her career, with her recent films like Vishwanath…
Anand Deverakonda and Vaishnavi Chaitanya’s Epic is facing brutal trolling after its OTT premiere on…