
Pawan backs Andhra artisans
జనసేన పార్టీతో పవన్ కళ్యాణ్ రాజకీయాలలో ప్రవేశించి డెప్యూటీ సిఎం అయినప్పటికీ అయన ఆసక్తులు వేరనే సంగతి తెలిసిందే.
రాజకీయ నాయకులందరూ పదవుల కోసం అర్రులు చాస్తుంటారు. అయితే ఆ పదవి, అధికారంతో సామాన్య ప్రజలకు, ముఖ్యంగా మారుమూల ఏజన్సీ ఏరియాలలో నివసిస్తున్న నిరుపేద ప్రజలకు మేలు చేయగలిగితే చాలనుకుంటారు పవన్ కళ్యాణ్. ఆయా ప్రాంతాలలో దశాబ్దాలుగా నెలకొన్న సమస్యలను పరిష్కరించి, వారికి ఉపశమనం కలిగిస్తే చాలనుకుంటారు.
అందుకే ఆయన చొరవతో రాష్ట్రంలో అల్లూరి సీతారామరాజు జిల్లాలోని ఏజన్సీ ఏరియాలకు రోడ్లు పడుతున్నయిప్పుడు. విద్యుత్ సౌకర్యం ఏర్పాటవుతోంది.
అయితే ఇన్నేళ్ళలో ఎవరూ పట్టించుకోని మరొక పెద్ద సమస్యపై కూడా అయన దృష్టి సారించి పరిష్కరించడం చాలా అభినందనీయం.
కలపతో ఏటికొప్పాక బొమ్మలు, బొబ్బిలి వీణలు, దేవతామూర్తుల విగ్రహాలు, చిత్రపటాలు వంటి రకరకాల అందమైన బొమ్మలు తయారుచేసే వేలాదిమంది కళాకారులు రాష్ట్రంలో ఉన్నారు.
ఇటువంటి హస్తకళలకు మంచి డిమాండ్ ఉన్నప్పటికీ, వాటిని తయారుచేసే కళాకారులకు అవసరమైన వివిధ రకాల కలప సమకూర్చుకోవడానికి చాలా శ్రమించాల్సి వస్తుంది. ఆ తర్వాత వాటిని అమ్ముకోవడం ఇంకా కష్టం.
‘ప్రభుత్వం హస్తకళలను ప్రోత్సహిస్తుంది.. హస్త కళాకారులకు అండగా నిలబడుతుంది..’ అని మంత్రులు ఎమ్మెల్యేలు, అధికారులు చెప్పే మాటలు తరచూ వినపడుతుంటాయి. కానీ వారి కోసం చేసిందేమీ కనిపించదు.
ఎందువల్లనంటే, హస్త కళాకారులకు ఇది జీవన్మరణ సమస్య కావచ్చు కానీ పాలకులకు అనేక సమస్యలలో అది కూడా ఓ సమస్య అంతే!
కానీ డెప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ వారి సమస్యని… దాని తీవ్రతని అర్థం చేసుకున్నారు. అధికారులతో చర్చించి దానికి సరైన పరిష్కారం కూడా కనుగొన్నారు. అదే.. ధవళేశ్వరం కేంద్రంగా రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసిన ఏడు క్రాఫ్ట్ వుడ్ బ్యాంక్స్!
పవన్ కళ్యాణ్ అటవీశాఖ మంత్రిగా కూడా వ్యవహరిస్తున్నారు. కనుక ఈ క్రాఫ్ట్ వుడ్ బ్యాంకులలో హస్తకళాకారులకు అవసరమైన వివిధ రకాల కలప అందుబాటులో ఉంచుతారు. ప్రస్తుతం ధవళేశ్వరం సెంట్రల్ క్రాఫ్ట్ వుడ్ బ్యాంకులో ముప్పై క్యూబిక్ మీటర్ల కలప అందుబాటులో ఉంచామని, అలాగే రాష్ట్రంలో ఆరు క్రాఫ్ట్ వుడ్ బ్యాంకులలో కూడా ఐదేళ్ళకు సరిపడే కలపని అందుబాటులో ఉంచుతామని చెప్పారు. అలాగే హస్తకళల మార్కెటింగ్ కొరకు అవసరమైన చర్యలు చేపడతామని డెప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు.
డెప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ తన సతీమణి అన్నా లెజినోవాతో కలిసి శనివారం ధవళేశ్వరం సెంట్రల్ క్రాఫ్ట్ వుడ్ బ్యాంకు సందర్శించి, అక్కడ వివిధ హస్త కళారూపాలను పరిశీలిస్తూ వాటి గురించి కళాకారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా అన్నా లెజినోవా కొన్ని బొమ్మలు కొనుగోలు చేశారు.
ప్యారడైజ్ సినిమా ప్రమోషన్స్ టైంలో పాన్ ఇండియా అనే పదాన్ని ఎక్కువగా ఎబ్యూజ్ చేస్తున్నామని చెప్పి మరీ.. తెలుగులో తప్ప…
Kannada cinema is increasingly proving that films made on modest budgets can find audiences beyond…