
హైదరాబాద్ లోని ఓ బ్యాంకుకు వచ్చిన పవన్ కళ్యాణ్, తన వద్దనున్న పాత నోట్లను బ్యాంకులో ఇచ్చి, కొత్త నోట్లను తీసుకున్నారు. నిజానికి పవన్ కళ్యాణ్ లాంటి స్థాయి వ్యక్తి బ్యాంకు వద్దకు వచ్చి నోట్లు మార్చుకుంటారని ఎవరూ ఊహించి ఉండరు. దీంతో పవన్ రంగ ప్రవేశంతో బ్యాంకు పరిసర ప్రాంతాలలో సందడి వాతావరణం నెలకొంది. పవర్ స్టార్ ను చూసేందుకు అభిమానులు, ప్రజలు ఎగబడ్డారు. అయితే పవర్ స్టార్ మాత్రం తను వచ్చిన కార్యాన్ని ముగించుకుని తిరుగు ప్రయాణం అయ్యారు.
బ్యాంకులో ఉన్న పవన్ ఫోటో ఒకటి సోషల్ మీడియాలో ప్రవేశించడంతో… పవన్ వ్యక్తిత్వం ఇదంటూ అభిమానులు ఫిదా అవుతున్నారు. ఇప్పటివరకు టాలీవుడ్ నుండి ఓ ఒక్క చిన్న, పెద్ద సెలబ్రిటీ కూడా బ్యాంకు దాకా రాకపోగా, పవర్ స్టార్ మాత్రం తన నోట్లను తానే మార్చుకోవాలంటూ విచ్చేసి, అందరీ మనసు మరోసారి దోచుకున్నాడు. అయితే ఎంత మొత్తంలో పవన్ తన నోట్లను మార్చుకున్నాడు అనేది తెలియరాలేదు.
ఆర్బీఐ నిబంధనల ప్రకారమైతే రోజులు కేవలం 4500 రూపాయలు మాత్రమే బ్యాంకులు మార్చాల్సి ఉంటుంది. దీంతో పవన్ కూడా అంతే మొత్తాన్ని తీసుకుని, మిగతా అంతా డిపాజిట్ చేసి ఉండవచ్చని తెలుస్తోంది. ఎంత తీసుకున్నా… ఎంత డిపాజిట్ చేసినా… తనంతట తానూగా పవన్ రావడం సంథింగ్ స్పెషలే కదా! ఇప్పటివరకు తన దగ్గర అంత డబ్బు లేదని చెప్తూ వచ్చిన పవన్ మాటలు ఈ సందర్భంగా నిజమయ్యాయని అభిమానులు అనేక సంగతులను సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్నారు.
Varun Dhawan’s films have not worked big at the box office over the last few…
BOTTOM LINE Painfully Boring RATING 1.75/5 Story, Screenplay, Director: Nishanth Doti Cast: Shiva Kumar Kasaram,…