Telugu

పవర్ స్టార్ ఫ్యాన్స్ సత్తాకు నిదర్శనం!

యూ ట్యూబ్ లో ఎప్పటికప్పుడు సరికొత్త రికార్డులను సృష్టించడం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానుల సొంతం. పవన్ నటించిన సినిమా టీజర్ నుండి ట్రైలర్ వరకు తెగ హంగామా చేసే అభిమానులు, ఈ సారి పవన్ సినిమా కాకపోయినా సత్తా చాటారు. ఆదివారం నాడు పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా ఆడియో విడుదల అయిన “సప్తగిరి ఎక్స్ ప్రెస్” సినిమా ట్రైలర్ 24 గంటల్లోనే 1 మిలియన్ క్లిక్స్ ను అందుకోవడం ఊహించినది కాదు.

సప్తగిరి వంటి ఒక సాధారణ కమెడియన్ సినిమా ట్రైలర్ 10 లక్షల క్లిక్స్ ను ఒక్క రోజులో అందుకుందంటే అది సాధారణ విషయం కాదు. పవన్ స్టార్ సినిమా ట్రైలర్ ను చూసినంతగా ఈ సినిమా ట్రైలర్ ను అభిమానులు ఎగబడి చూసినట్లుగా అర్ధమవుతోంది. నిజానికి పవన్ నటించిన గత చిత్రం “సర్దార్ గబ్బర్ సింగ్” ట్రైలర్ కూడా ఒక్క రోజులో 1 మిలియన్ క్లిక్స్ ను అందుకోవడంలో విఫలమైంది.

ADVERTISEMENT

ఈ తాజా పరిణామాలతో “సప్తగిరి ఎక్స్ ప్రెస్”పై ప్రేక్షకుల్లో ఎంతటి అంచనాలు నెలకొన్నాయో అర్ధమవుతోంది. మరి ఈ అంచనాలను సప్తగిరి ఎంతవరకు అందుకుంటాడో గానీ, ‘సప్తగిరి ఎక్స్ ప్రెస్’ ఓపెనింగ్స్ విషయంలో ఏ మాత్రం డోకా లేదని పవన్ అభిమానులు పరోక్షంగా చెప్పకనే చెప్తున్నారు. దీంతో కమర్షియల్ గా ‘సప్తగిరి ఎక్స్ ప్రెస్’ విజయాన్ని చవిచూడడం ఖాయంగానే కనపడుతోంది.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

రేపటి పోలింగ్: పిల్లికి చెలగాటం, ఎలుకకు ప్రాణసంకటం! పిల్లి, ఎలుక ఎవరు?

ఆదివారం రాష్ట్ర వ్యాప్తంగా స్థానిక సంస్థల ఎన్నికలు జరగబోతున్నాయి. నిజానికి చెదురుమదురు ఘటనలు మినహా ఈ ఎన్నికలు చాలా సజావుగా,…

8 minutes ago

Day 1 BO: How Did AK47 And Cult Start?

Telugu cinema witnessed two new theatre films this weekend in the form of Aadarsha Kutumbam(AK-47)…

13 minutes ago