
ఈ హంగామా ఒక్క తెలుగు రాష్ట్రాల వరకే పరిమితం కాలేదు. ఏపీకి – కర్ణాటకకు బోర్డర్ లో ఉన్నటువంటి బళ్ళారిలో ‘సర్ధార్’ హంగామా షురూ అయ్యింది. ధియేటర్లను ‘సర్ధార్’ ఫ్లెక్సీలతో ముస్తాబు చేస్తూ, వాటిని సోషల్ మీడియాలో పెడుతూ ఓ రకంగా అభిమానుల కడుపు నింపుకుంటున్నారు. ఏపీ, తెలంగాణాలో కాకుండా ఇతర రాష్ట్రాలలో పవన్ కున్న క్రేజ్ ను మురిసిపోవడం పవర్ స్టార్ ఫ్యాన్స్ వంతవుతోంది.
‘అత్తారింటికి దారేది’ సినిమా తర్వాత పవన్ ను ఫుల్ లెంగ్త్ హీరోగా చూస్తున్న తరుణం కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఏరియాల వారిగా ఏప్రిల్ 7వ తేదీన పడబోయే మిడ్ నైట్ షోల సంగతులు కూడా ట్విట్టర్ వేదికగా వెలుగు చూస్తున్నాయి. అంటే 8వ తేదీన కోడి కూయక ముందే ‘సర్ధార్’ టాక్ కూయనుందన్న మాట.
ప్యారడైజ్ సినిమాకి ట్రైలర్ లేకుండానే ప్యాన్ ఇండియా ప్రమోషన్స్ చేసేస్తున్నాడు నాని. చెన్నై, బెంగుళూరు, కొచ్చి వెళ్లి.. అక్కడ మీడియా…
India has replaced its film certification guidelines that had been in use since 1991. The…