పవన్ కళ్యాణ్ అభిమానులకు అంచనాలు లేవు కాబట్టి సరిపోయింది

Pawan Kalyan fans had no expectations on Cabinet postకేంద్రంలోని నరేంద్ర మోడీ తన మంత్రివర్గంలో కీలక మార్పులు చేశారు. చాలా మంది ప్రముఖులను సాగనంపి ఏకంగా నలభై మూడు మంది కొత్త వారికి చోటిచ్చారు. రెండు తెలుగు రాష్ట్రాల నుండి ఒక్క కొత్త పేరు కూడా లేకపోయింది.

ఇప్పటికే సహాయ మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డికి కేబినెట్ మంత్రిగా పదోన్నతి దక్కింది. ఇది ఇలా ఉండగా… ఆంధ్రప్రదేశ్ నుండి మిత్రపక్షం జనసేన తరపున పవన్ కళ్యాణ్ కి కేబినెట్ పదవి ఖాయమని ఒక వర్గం మీడియా ఊదరగొట్టింది.

ADVERTISEMENT

అయితే ఇప్పుడు అదంతా బుస్సు అని తేలింది. అసలు ఈ తతంగంతో సంబంధం లేదు అన్నట్టు… పవన్ కళ్యాణ్ … ప్రస్తుతం విజయవాడలో తన జనసేన పార్టీ కార్యకలాపాలతో బిజీగా ఉన్నారు. ఈ ఊహాగానాలు, వదంతులు చాలా రోజులుగా ఉన్న జనసైనికులు అసలు నమ్మకం పెట్టుకోలేదు.

సినిమాలు వదల్లేని పవన్ కళ్యాణ్ కు అంతటి బాధ్యతని అప్పగిస్తారంటే నమ్మలేదో లేక బీజేపీ జనసేన ను గౌరవించడం తెలియదు అనుకున్నారో గానీ వారికి ముందు నుండీ అంచనాలు లేవు. దానితో అభిమానులలో ఎటువంటి నిరాశ కనిపించలేదు. జనసేన విజయవాడ సమావేశంలో పవన్ కళ్యాణ్ స్పీచ్ తో సోషల్ మీడియా సోదరులు బిజీగా కనిపించారు.

అసలు కేబినెట్ విస్తరణ గురించి తెలియదు అన్నట్టుగానే ఉండిపోయారు. అంచనాలు, ఆశలు లేవు కాబట్టి సరిపోయింది గానీ లేకపోతే పాపం చాలానే నిరాశపడేవారు.

ADVERTISEMENT
Latest Stories