
అలాగే పవన్ ఫ్యాన్స్ పై వివిధ ఈవెంట్లలో మండిపడ్డ నాగబాబు, అల్లు అర్జున్ వైనాన్ని ప్రస్తావిస్తూ… ఎవరెన్ని చెప్పినా… చివరగా పవన్ అభిమానులు మారనంత వరకు ఈ తీరు ఇలాగే కొనసాగుతుంది… మారాల్సింది హీరోలు కాదు.., పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మాత్రమే… ఈ కధనానికి ముగింపు పలికిన సదరు ఛానల్.., ‘అసలు పవన్ ఫ్యాన్స్ మారతారా..?’ అంటూ మరో శేష ప్రశ్నను కూడా మిగిల్చింది. పొగిడినంత సేపు కేరింతలు కొట్టే అభిమానులు… అతిథుల చేత బలవంతంగా ఎలా పవన్ నామస్మరణ చేయిస్తున్నారో సదరు కధనంలో ప్రసారమైన వీడియోల ద్వారా వీక్షకులకు స్పష్టంగా చూపించారు.
ఓ పక్కన సోషల్ మీడియాలో ఇటీవల ‘బ్రహ్మోత్సవం’ విడుదల సందర్భంలో కూడా వ్యతిరేక ప్రచారం చేసిన ‘అపవాదు’ను మూటగట్టుకున్న పవన్ అభిమానులు… పరోక్షంగా ఓ టీవీ యాంకర్ ద్వారా ఇటీవల ఫేస్ బుక్ వేదికగా అక్షింతలు వేయించుకున్నారు. తాజాగా మరొక మీడియా కధనం. ఏదొక టాపిక్ తో ఏదొక వివాదంతో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎప్పుడూ హాట్ టాపిక్ గా నిలవడం గమనించదగ్గ అంశం.
Srijita Ghosh turns a rain-kissed glass setting into a striking fashion frame, pairing delicate white…
Venkatesh and Trivikram’s Aadarsha Kutumbam has officially moved from October 2 to October 9. The…