జనసేనని గెలిపించేది ప్రజలు… ఓడించేది శ్రేయోభిలాషులే?

గత ఎన్నికలలో ఒంటరిగా పోటీ చేసిన జనసేన ఒకే ఒక్క సీటు గెలుచుకోగలిగింది. పవన్‌ కళ్యాణ్‌ పోటీ చేసిన రెండు చోట్ల ఓడిపోయారు. ఈ విషయం పవన్ వీరాభిమానులందరికీ, ముఖ్యంగా ఆయన శ్రేయోభిలాషులకి బాగా తెలుసు.

కానీ వాపుకు, బలుపుకి తేడా గుర్తించలేక టిడిపితో పొత్తుని కూడా తీవ్రంగా వ్యతిరేకించారు. పవన్‌ కళ్యాణ్‌ గట్టిగా వార్నింగ్ ఇచ్చాక కాస్త తగ్గినా, మళ్ళీ మొన్న టిడిపి, జనసేనల తొలి జాబితాని ప్రకటించినప్పటి నుంచి పవన్‌ కళ్యాణ్‌ ‘శ్రేయోభిలాషుల బ్యాచ్’ సోషల్ మీడియాలో చాలా రెచ్చిపోతోంది.

ADVERTISEMENT

చంద్రబాబు నాయుడుని జగన్‌ అరెస్ట్ చేసి జైల్లో పెడితే పవన్‌ కళ్యాణ్‌ వెళ్ళి ఓదార్చారని, ఆయనపై జాలితో పొత్తులకి అంగీకరించారని, లేకుంటే జనసేనకు ఆ అవసరమే లేదని చెప్పుకుంటున్నారు. పవన్‌ కళ్యాణ్‌ టిడిపితో పొత్తు ప్రకటన చేసిన తర్వాత నుంచే వైసీపిలో భయం మొదలైందని వాదిస్తున్నారు.

కష్టకాలంలో అండగా నిలబడ్డారనే విశ్వాసం కూడా లేకుండా చంద్రబాబు నాయుడు జనసేనకు కేవలం 24 సీట్లు విదిలించి పవన్‌ కళ్యాణ్‌ని అవమానించారని బాధ పడుతున్నారు. మళ్ళీ పవన్‌ కళ్యాణ్‌ చేత తమకు నచ్చజెప్పిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

కొందరు మరో అడుగు ముందుకు వేసి, టిడిపితో పొత్తు పెట్టుకొన్నప్పటికీ, జనసేన పోటీ చేసే చోట మన అభ్యర్ధులకు వేసుకుందామని, కానీ టిడిపి పోటీ చేసే చోట మనకు నచ్చిన పార్టీలకి, అభ్యర్ధులకు వేసుకుందామని సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు.

టిడిపి మీద జనసేన ఆధారపడి లేదని, జనసేన మీదనే టిడిపి ఆధారపడి ఉందనే విషయం గుర్తుంచుకొని బుద్ధిగా మెసులుకోవాలని మరికొందరు హితవు చెపుతున్నారు. ఒకవేళ పవన్‌ కళ్యాణ్‌ టిడిపిని, చంద్రబాబు నాయుడుని వద్దనుకుంటే, తమతో కలిసి పనిచేయడానికి బీజేపీ పెద్దలు సిద్దంగా ఉన్నారని, జనసేనకు మెజార్టీ సీట్లు ఇచ్చి, పవన్‌ కళ్యాణ్‌ని ముఖ్యమంత్రి అభ్యర్ధిగా ప్రకటిచేందుకు సిద్దంగా ఉన్నారని కొందరు చెపుతున్నారు.

పవన్‌ కళ్యాణ్‌ సినిమాలతో ఆయనకు అభిమానులుగా మారి జనసేనలోకి వచ్చినవారికి ఆయన ఓ హీరోగానే కనిపిస్తుంటారు. వారి అభిమానం అటువంటిది. వారికి లోతైన రాజకీయ పరిజ్ఞానం లేకపోతే తప్పు కాదు.

కానీ గత పదేళ్ళుగా పవన్‌ కళ్యాణ్‌తో పాటు రాజకీయాలలో నలుగుతూ, జనసేన వీరమరణాన్ని కళ్ళారా చూసి, ఆ తర్వాత రాష్ట్రంలో వైసీపి విధ్వంసాన్ని, అరాచకాలను కళ్ళారా చూసి అనుభవిస్తున్న జనసేన నేతలు కూడా ఈవిదంగా మాట్లాడుతుండటం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది.

జనసేనకు కేవలం 24 సీట్లు మాత్రమే దక్కాయని బాధపడుతున్నవారు, ఆ 24 మందినీ తప్పకుండా గెలిపించుకోగలరా?అంటే అనుమానమే. ఎందువల్ల అంటే పవన్‌ కళ్యాణ్‌ అభిమానులలోనే వైసీపి, టిడిపి, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందినవారు కోకొల్లలు ఉన్నారు. వారు ఓ హీరోగా పవన్‌ కళ్యాణ్‌ని అభిమానిస్తామని, కానీ ఎన్నికలలో తమ తమ పార్టీలకే ఓట్లు వేసుకుంటామని చెప్పుకోవడం జనసేన శ్రేయోబిలాషులకు, మేధావులకు తెలిసే ఉంటుంది.

అందుకే పవన్‌ కళ్యాణ్‌ “అందరూ నా వెంట వచ్చి చప్పట్లు కొట్టేవారే కానీ ఓట్లు వేసేవారెందరు?” అని అడుగుతున్నారు కదా? పవన్‌ కళ్యాణ్‌ ప్రశ్నకు ‘శ్రేయోభిలాషుల బ్యాచ్’ సమాధానం చెప్పగలదా? కానీ టిడిపికి దక్కిన 94 సీట్లలో కనీసం 70-80 మంది సొంత బలంతో, పార్టీ శ్రేణుల అండదండలతో గెలవగల సమర్ధులే. ఈ విషయం పవన్‌ కళ్యాణ్‌ ‘శ్రేయోభిలాషుల బ్యాచ్’కు బాగా తెలుసు.

అసలు జనసేనలో ఎంతమంది నేతల పేర్లు ఆ పార్టీలో అందరికీ తెలుసు?రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు?వారిలో ఎంతమంది దేశ ముదురు వైసీపి ఎమ్మెల్యే అభ్యర్ధులతో పోటీ పడి కోట్లు వెదజల్లగలరు?ఎంత మంది వారిని ఢీ అంటే ఢీ అని ఎదుర్కొని పోరాడగలరు?ఒకవేళ ఈ ఎన్నికలలో జనసేనకు కేటాయించిన ఆ 24 సీట్లు కూడా గెలుచుకోలేకపోతే అప్పుడు శ్రేయోభిలాషుల బ్యాచ్ ఏమని సమర్ధించుకోగలదు? అని ఓసారి ఆలోచిస్తే మంచిది.

జగన్‌ దెబ్బ రుచి చూసిన రాష్ట్ర ప్రజలు ఇప్పుడు మార్పు కోరుకొంటున్నారు. రాష్ట్రంలో ఇప్పుడు టిడిపి, జనసేనలకు చాలా అనుకూల వాతావరణం నెలకొని ఉంది. ఇటువంటి మంచి అవకాశం, వాతావరణం మళ్ళీ మళ్ళీ ఏర్పడదు. కనుక టిడిపి, జనసేనల కూటమిని దెబ్బతీసుకునే ప్రయత్నాలు మా

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Recent Posts

RR Star’s New Skill a Joke? Desperate Move or Disaster

Yashasvi Jaiswal has started working on wicketkeeping ahead of the 2026-27 Ranji Trophy season, but…

24 minutes ago

Pics: Khushi Makes Black Look Fierce And Fabulous!

Khushi Dubey knows how to make black feel anything but basic. In this striking photoshoot,…

54 minutes ago