Telugu

రెండు వారాల్లోనే అంతా చల్లబడిందిగా!

తెలంగాణలో రాజకీయ వాతావరణం ఎప్పుడూ వేడిగానే ఉంటుంది. కానీ తొలకరి జల్లులు మొదలవడంతో బయట వాతావరణం చల్లబడింది.

రెండు వారాల క్రితం జనసేనాని పవన్ కళ్యాణ్‌ హైదరాబాద్‌లో ప్రెస్‌మీట్‌ తర్వాత వేడెక్కిన రాజకీయ వాతావరణం కూడా పూర్తిగా చల్లబడినట్లే ఉంది.

ADVERTISEMENT

అయితే అటువంటి రాజకీయాలను ప్రజలు, ముఖ్యంగా అభిమానులు లైట్ తీసుకుంటారని నేడు పవన్ కళ్యాణ్‌ హనుమకొండ పర్యటనతో స్పష్టమైంది.

హనుమకొండకు చెందిన నిరంజన్ (17) ఏళ్ళ బాలుడు అరుదైన జన్యుపరమైన డీఎండీ వ్యాధితో బాధపడుతున్నాడు. గత కొన్నేళ్లుగా మంచానికే పరిమితమైన అతను ఎప్పటికైనా తన అభిమాన హీరో పవన్ కళ్యాణ్‌ను ఒక్కసారి కలవాలని ఆరాటపడ్డాడు.

ఈ విషయం తెలిసిన వెంటనే ఏపీ డెప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్‌ నేడు హనుమకొండ వచ్చినప్పుడు దారి పొడవునా అభిమానులు, ప్రజలు ఆయనకు సాదరంగా స్వాగతం పలికారు. ఆయన కూడా వారికి అభివాదం చేస్తూ నిరంజన్‌ ఇంటికి వెళ్ళి పరామర్శించారు. “నేను ఓజీ-2 చేసినట్లయితే ఆ సినిమా ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌కి నువ్వే నా చీఫ్ గెస్ట్..” అంటూ పవన్ కళ్యాణ్‌ చెప్పడంతో ఆ బాలుడు పొంగిపోయాడు. అతనితో మాట్లాడి ధైర్యం చెప్పారు. కుటుంబ సభ్యులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.

రాజకీయాలు ప్రాంతాలను, మనుషులను కలపాలే తప్ప విడగొట్టడానికి కాదు పవన్ కళ్యాణ్‌ మొదటి నుంచి చెపుతూనే ఉన్నారు. అదే నిరూపించి చూపారు. తెలంగాణ ప్రజలు కూడా అదే స్పూర్తి కనపరిచారు. కానీ తెలంగాణవాదం పేరుతో రాజకీయ మనుగడ సాగిస్తున్న కొన్ని పార్టీలు, నేతలకు ఇదే జీర్ణించుకోవడం కష్టమే. కానీ పవన్ కళ్యాణ్‌ హనుమకొండ పర్యటనపై రాజకీయాలు చేయకుండా సంయమనం పాటించినందుకు అభినందించాల్సిందే.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

AK47: Trivikram & Naga Vamsi Fumble Golden Dasara Window

Venkatesh’s much-hyped Aadarsha Kutumbam AK 47, directed by Trivikram, has been indefinitely postponed. Producer Naga…

4 hours ago

New Passport Rules for Minors NRI Parents Must Know

The Ministry of External Affairs in India has amended the passport rules for minors of…

4 hours ago