
సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధుతోపాటు మరో ఇద్దరు నాయకులు మధ్యాహ్నం జనసేన కార్యాలయానికి వచ్చారు. కాగా. వీరిని కార్యాలయంలోకి వెళ్ళకుండా సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారు. తమకు సమాచారం లేదని, లోనికి అనుమతించమంటూ నేతలను అడ్డుకున్నారు. దీంతో చేసేదేమీలేక దాదాపు ఓ పావుగంట సేపు అలాగే గేటు బయట వామపక్ష నేతలు నిల్చుండిపోయారు.
వేరే మీటింగులో ఉన్న పవన్ కళ్యాణ్ ఆ తరువాత వారిని పంపమని చెప్పారట. లోపాలకి పంపాల్సిందిగా సెక్యూరిటీకి ఆదేశాలు రావటంతో చివరకు గేట్లు తీశారు. ఆ తర్వాత వామపక్ష నేతలు లోనికి వెళ్లారు. ఈ అవమానంతో వామపక్షనేతలు లోలోపలే రగిలిపోతున్నారట. ఇప్పటికే ఉమ్మడి కార్యాచరణాలలో జనసేన జెండాలు ఎర్ర జెండాలను డామినేట్ చెయ్యడం వారికి నచ్చట్లేదని సమాచారం.
From Rocky Bhai to Raya, Yash has delivered a bona fide disaster with Toxic.…
Yash's Toxic was sold as a pan-India and global event, but its overseas performance is…