
‘ప్రత్యేక హోదా’ కాకుండా ‘ప్రత్యేక ప్యాకేజ్’ ప్రకటించిన సమయంలో పోరాటం చేయాల్సిన పవన్, చేతులెత్తేసిన వైనం విమర్శలకు దారి తీసింది. మరో ఏడాదిలో ఎన్నికలు జరగబోతున్న నేపధ్యంలో… ‘ప్రత్యేక హోదా’ అంశం చుట్టూ రాజకీయం జరుగుతోంది. బిజెపి ఇవ్వనంటోంది, టిడిపి పోరాటం చేస్తానంటోంది, వైసీపీ ఏమో బిజెపి ద్వారానే స్పెషల్ స్టేటస్ ను తెప్పిస్తామంటోంది… ఇలా ఒక్కో పార్టీ ఒక్కో అభిప్రాయంతో ముందుకు వెళ్తుంటే… ‘ప్రత్యేక హోదా’ అన్న అంశం రాజకీయంగా ఉపయోగపడుతోంది తప్ప, దానిని సాకారం చేసే దిశగా ఎవరూ అడుగులు వేయడం లేదు.
నిజంగా చెప్పాలంటే… ‘స్పెషల్ స్టేటస్’ను నెత్తికెత్తుకోవడానికి ఒక నిజాయితీ, నికార్సైన నాయకుడు కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎదురుచూస్తోంది. అధికారంలో ఉన్న చంద్రబాబు ఏమీ చేయలేని పరిస్థితి కాగా, చంద్రబాబుపై ఒత్తిడి తేవడం మినహా వైసీపీకి చిత్తశుద్ధి లేదు. ఇక కేంద్రంలో ఉన్న బిజెపి గురించి ఎంత తక్కువగా మాట్లాడుకుంటే, ఆరోగ్యానికి అంత మంచిది! ఈ తరుణంలో బిజెపి మెడలు వంచాలంటే సామాన్యమైన విషయం కాదు. బుధవారం నాడు జరగబోతోన్న సమావేశంలో పవన్ కీలక ప్రకటనలు చేస్తే తప్ప, పవన్ పై కూడా ప్రజలకు నమ్మకం కలిగే పరిస్థితి లేదు.
ముఖ్యంగా ‘స్పెషల్ స్టేటస్’ సాధించేందుకు పవన్ కార్యాచరణ ప్రజలను ప్రభావితం చేయనుందన్నది స్పష్టం. ఆమరణ నిరాహార దీక్ష చేస్తారా? బంద్ లకు పిలుపునిస్తారా? కేంద్ర సంస్థలను ముట్టడిస్తారా? ఢిల్లీలో నిరసనలు తెలియజేస్తారా? ప్రజలను మేలుకొలిపే విధంగా కార్యక్రమాలు చేస్తారా? ఇలా రకరకాల ప్రశ్నలు ప్రజల్లో కలుగుతున్నాయి. ఏది ఏమైనా…. ప్రత్యేక హోదాపై పవన్ గట్టిగా నిలబడితే… ఖచ్చితంగా రియల్ హీరో అయ్యే అవకాశం పుష్కలంగా కనపడుతోంది. అవకాశాలు అన్ని సార్లు రావు… ప్రతిసారి వదిలేసుకుంటే… భవిష్యత్తు అగమ్యగోచరంగా మారుతుందని పవన్ కూడా గుర్తించాల్సిన సమయం ఇది..!
From Rocky Bhai to Raya, Yash has delivered a bona fide disaster with Toxic.…
Yash's Toxic was sold as a pan-India and global event, but its overseas performance is…