Telugu

పవన్ కళ్యాణ్ కి సూటిగా సుత్తి లేకుండా 6 ప్రశ్నలు!

జనసేన స్థాపించి నాలుగు సంవత్సరాలు ఐన తరువాత పవన్ కళ్యాణ్ పూర్తిగా రాజకీయనాయకుడిగా పరివర్తనం చెందారు. నిన్నటి గుంటూరు సభలో ఆయన ఫక్తు రాజకీయ భాషలో దాదాపుగా రెండు గంటల పాటు చంద్రబాబు ప్రభుత్వంపై విమర్శలు చేసారు. ఆయన ప్రసంగం జనసేన కార్యకర్తలలో ఊపు తెప్పించిన ఎప్పటిలానే చాలా ప్రశ్నలకు సమాధానాలు లేవు. అలాగే చాలా ఆరోపణలలో క్లారిటీ కొరవడింది.

దీనితో నాకున్న అనుమానాలు పవన్ కళ్యాణ్ గానీ ఆయన అభిమానులు గానీ సమాధానం చెబుతారని ఆశిస్తూ ఈ ఓపెన్ లెటర్ రాస్తున్నా. అవినీతిలో ఆంధ్రప్రదేశ్ ఒకటవ స్థానంలో ఉన్నదీ అని ఎన్సీఈఏఆర్ అనే సంస్థ చెప్పిన వాటి ఆధారంగా పవన్ కళ్యాణ్ ఆరోపణలో చేసారు. అయితే అదే సంస్థ తాజాగా ఇచ్చిన ర్యాంకులలో ఏపీ తాజాగా 13వ ర్యాంకు వచ్చింది వాస్తవం కాదా? అదే సంస్థ పెట్టుబడుల ఆకర్షణలో ఏపీ మూడవ స్థానంలో ఉంది అని చెప్పింది పవన్ కళ్యాణ్ కు తెలీదా?

ADVERTISEMENT

లోకేష్ పై అవినీతి ఆరోపణలు చేశారు సరే అయితే అవి ఏంటో చెప్పాల్సిన బాధ్యత పవన్ కళ్యాణ్ కు లేదా? తమిళనాడు లో అరెస్టు ఐన శేఖర రెడ్డికి లోకేష్ కి సంబంధాలు ఉండటం వల్లే ప్రధాని చంద్రబాబుకు అపాయింట్మెంట్ ఇవ్వట్లేదని అనుకుంటున్నారు, నాకైతే తెలీదు అని పవన్ కళ్యాణ్ నిన్న అన్నారు. లోకేష్ పై ఆరోపణల వల్ల ఏపీకి ఇవ్వాల్సినవి ఎలా ఇవ్వకుండా ఉంటారు? దానిని పవన్ కళ్యాణ్ సమర్థిస్తున్నారా?

ఒకవేళ అదే నిజమైతే విచారణకు ఆదేశించే హక్కు కేంద్రానికి లేదా? అంతేగానీ రాజ్యాంగపరంగా ఎన్నికైన చంద్రబాబును కలవము అంటే పవన్ కళ్యాణ్ దానిని ఎలా సమర్థిస్తారు. పర్యావరణంపై సర్కారుకు బాధ్యత లేదని అందుకే ఆక్వా ఫుడ్ పార్కుకు అనుమతి ఇచ్చారు అని ఆరోపించారు. అటవీ సంపద పెంచటంలో ఏపీ కేంద్రం లెక్కల ప్రకారం మొదటి స్టానంలో ఉందనే విషయం పవన్ కళ్యాణ్ కు తెలీదా? ఎర్ర చందనం అక్రమ రవాణా అరికట్టడంలో ప్రభుత్వం విఫలం అయ్యిందనేది మరో విమర్శ.

అసలు ఎర్రచందనం ని పరిరక్షించడానికి చంద్రబాబు ప్రభుత్వం చేపట్టిన చర్యలు వేరే ప్రభుత్వమేది చెయ్యలేదనిది వివాదం లేని అంశం. 20 మంది స్మగ్లర్లను ఎన్కౌంటర్ చేస్తే తమిళనాడులో హెరిటేజ్ సంస్థలపై దాడులు జరిగినవి నిజం కాదా? ఇసుక అక్రమ రవాణాపై కొంత మేర పవన్ కళ్యాణ్ చేసిన ఆరోపణలు నిజమే. దానిని అరికట్టడానికే కదా ఇసుకను ఉచితం చేసింది.

కాపులకు బీసీలకు మధ్య గొడవ పెట్టారు… ఎస్సీ కులాల మధ్య గొడవలు పెట్టారు… రాష్ట్ర ప్రభుత్వం కులాల మధ్య చిచ్చు పెట్టింది అని పవన్ కళ్యాణ్ ఆరోపించారు. ఈ వాగ్దానాలు ఇప్పుడు చేసినవి కాదుకదా? పవన్ కళ్యాణ్ పక్కన కూర్చునే ఈ హామీలు చంద్రబాబు చేశారు. అప్పుడు అడగకుండా ఇప్పుడు మాట్లాడటమేంటి? ఎమ్మార్వో వనజాక్షి మీద దాడి అందరు ఖండించాల్సిందే. కానీ 2015లో జరిగిన ఆ సంఘటనపై ఇప్పటిదాకా పవన్ కళ్యాణ్ ఎందుకు స్పందించలేదు.

రాజధానికి 35000 ఎకరాలు ఎందుకు అంటున్నారు? మరి మీ ఇంటికి అమరావతిలో దాదాపుగా మూడు ఎకరాలు ఎందుకు? అని కొందరు ఆరోపిస్తున్నారు దానికి మీ సమాధానం ఏమిటి? చంద్రబాబు, జగన్‌కి వాళ్లభయాలు వాళ్లకు ఉండొచ్చు… మీరు సీబీఐ కేసులు పెడతారని మిగతావారికి భయం ఉండొచ్చు… కానీ, నాలాంటి వారికి ఎలాంటి భయం లేదు అని మీరు నిన్న అన్నారు. సంతోషం. కాకపోతే మీ గంటా నలభై ఏడు నిముషాల ప్రసంగంలో ఒక్కసారైనా మోడీని గాని అమిత్ షాని గానీ ఏమి అనలేదు దేనికి?

టీడీపీ ఎంపీలను విమర్శించే ముందు రాజ్యసభలో ఉన్న మీ అన్నగారు చిరంజీవికి మీరు తన బాధ్యత గుర్తు చెయ్యాల్సిన అవసరం లేదా? ఇప్పుడు ఇవన్నీ ఎందుకు అడుగుతున్నా అంటే వీటికి స్పష్టమైన వివరణ ఇస్తే మీరు చేసే ఆరోపణలకు విలువ ఉంటుంది. సగటు ఓటర్లతో పాటు టీడీపీ వారిని కూడా ఆలోచింపచేస్తుంది. లేకపోతే గతంలో మీకు మీకు ఉన్న సంబంధాలు చెడటం వల్లే ఇటువంటి విమర్శలు చేస్తున్నారు అనుకునే ప్రమాదం ఉంది.

*- మిర్చి9 పాఠకుడు తేజ కలవపూడి (tejakalavapudi.mba@gmail.com) పంపిన ఇమెయిల్ యధాతధంగా ప్రచురించడమైనది. ఇందులోని అభిప్రాయాలకు మిర్చి9 కు ఎటువంటి సంబంధం లేదు. పాఠకులు తమ ఉత్తరాలు మిర్చి9 లో ప్రచురింబడాలి అనుకుంటే మా ఈమెయిల్ (​contact@m9.news) పంపగలరు.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Watch: Toxic FAILED, But #Yash DID NOT!

 From Rocky Bhai to Raya, Yash has delivered a bona fide disaster with Toxic.…

3 hours ago

Toxic Washout Overseas: Fairy Tale Turns into Scary Tale?

Yash's Toxic was sold as a pan-India and global event, but its overseas performance is…

7 hours ago