
[m9ad]
వివిధ వర్గాల ప్రజలతో వారు మమేకమై అభిప్రాయాలను సేకరించారు. ఈ సర్వే నివేదిక ఆధారంగానే పలువురు నేతలకు జగన్ ఇప్పటికే పరోక్ష సంకేతాలను పంపినట్టు సమాచారం. సర్వే నివేదిక ఆధారంగా పాదయాత్ర జరుగుతున్న ప్రాంతాల్లోనే జిల్లాల నేతలతో సమావేశం నిర్వహించాలని జగన్ మొదట్లో భావించారు. అయితే వివిధ కారణాలతో ఆ కార్యక్రమం వాయిదా పడుతూ వచ్చింది.
త్వరలోనే నేతలతో జగన్ వరుస భేటీలు ఉండనున్నట్టు సమాచారం. మరోవైపు పీకే టీమ్ సర్వే జరిపిన విషయం వాస్తవమేనని, అయితే సర్వేలో ఏయే నాయకుడిపై ఎలాంటి రిపోర్ట్ ఉందో మాత్రం తనకు తెలియదని పార్టీకి చెందిన ఓ నేత తెలిపారు. ప్రస్తుతం వైసీపీ నేతల్లో ఈ సర్వే గుబులు రేపుతోంది. రానున్న ఎన్నికల్లో తమకు టికెట్ దక్కుతుందో, దక్కదో అని పలువురు నేతలు టెన్షన్ కు గురవుతున్నారట.
Fahadh Faasil's debut Telugu film as a lead actor, Don't Trouble the Trouble directed by…
With the theatrical run and OTT release behind it, the entire cycle of The Paradise…