
ముఖ్యంగా వైసీపీతో తమకు ‘అక్రమ సంబందం’ లేదని బిజెపి, కేంద్ర ప్రభుత్వం కూడా నిరూపించుకొంటే ఆంద్రా ప్రజల నమ్మకం పొందగలుగుతుంది. కానీ ఎంపీల మద్దతు తప్ప ప్రజల నమ్మకంతో తమకు పనిలేదన్నట్లు వ్యవహరిస్తే, బిజెపితో పాటు జనసేన కూడా మునుగుతుంది.
నిజానికి ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఆంధ్రా ప్రజల పట్ల ఏవిదంగా వ్యవహరించిందో, గత నాలుగేళ్ళుగా బిజెపి కూడా సరిగ్గా ఆలాగే వ్యవహరిస్తోంది. ఇది తెలిసి ఉన్నపటికీ పవన్ కళ్యాణ్ బిజెపితో ఎందుకు కలిసి ముందుకు సాగాలనుకొంటున్నారంటే, తాను ముఖ్యమంత్రి అవడానికి మాత్రం కాదు. వైసీపీని ఎదుర్కోవాలంటే కేంద్ర ప్రభుత్వం అండదండలు అవసరమని మాత్రమే!
అయితే బిజెపికి జనసేన మిత్రపక్షంగా సాగుతున్నప్పటికీ, వైసీపీ నేతలు పవన్ కళ్యాణ్‌తో ఏవిదంగా చెడుగుడు ఆడుకొంటున్నారో అందరూ చూస్తూనే ఉన్నారు. అయినా సోమూ వీర్రాజు లేదా బిజెపి నేతలు ఏనాడూ పవన్ కళ్యాణ్‌కు అండగా నిలబడలేదు. ఇప్పుడు దగ్గుబాటి పురందేశ్వరి బిజెపి పగ్గాలు చేపడుతున్నారు కనుక ఇకనైనా ఏపీ బిజెపి నేతలు జనసేనకు ఎంత గట్టిగా మద్దతు ఇస్తే అంతా వారికే మేలు కలుగుతుంది.
జనసేన బిజెపిపై ఒకందుకు ఆధారపడుతుంటే, బిజెపి ఏపీలో నిలదొక్కుకొనేందుకు జనసేనతో దోస్తీ చేస్తోందనేది బహిరంగ రహస్యం. కనుక వేర్వేరు కారణాలతో పరస్పరం ఆధారపడి ఉన్నప్పుడు పరస్పరం సహకరించుకోవడం కూడా అంతే అవసరం. ఇందుకు జనసేన సిద్దంగానే ఉంది. మరి బిజెపి సిద్దంగా ఉందా?దగ్గుబాటి పురందేశ్వరే చెప్పాలి!
ఆంధ్రాలో జనసేన పుంజుకొంటే దానితో కలిసి సాగుతున్నందుకు బిజెపి కూడా గౌరవప్రదమైన సీట్లు సంపాదించుకోగలుగుతుంది. అవసరమైతే తెలంగాణలో కూడా బిజెపి, జనసేనలు కలిసి ముందుకు సాగవచ్చు. అప్పుడు అక్కడ కూడా బిజెపికి పవన్ కళ్యాణ్ అభిమానులు మద్దతు లభిస్తుంది.
ఇక జనసేన సరైన దారిలోనే ప్రయాణిస్తోందని చెప్పొచ్చు. అయితే పవన్ కళ్యాణ్ ముందు నుంచి చెపుతున్నట్లుగా వైసీపీ వ్యతిరేక ఓట్లు చీలనీయకుండా ఏవిదంగా జాగ్రత్తవహిస్తారనేది చాలా ముఖ్యం. లేకుంటే ఈ ప్రయోగాలు, శ్రమ అంతా వృధా అయిపోతాయి.
చిత్రం: సర్దార్ 2 M9 రేటింగ్: 1.25/5 విడుదల తేదీ: సెప్టెంబర్ 10, 2026 తారాగణం: కార్తీ, మాళవిక మోహనన్,…
Revanth Reddy has been maintaining an active person on social media for a long time…