
తాజాగా రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారిన పవన్ – అన్నా విడాకుల వార్త ఏపీ రాజకీయాల పై మరీ ముఖ్యంగా జనసేన రాజకీయ భవిష్యత్ పై ప్రభావం చూపనుందా? అన్న చర్చ నడుస్తుంది. ఈ నేపథ్యంలో ఏపీలో జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు ఆ చర్చకు తెరతీయనున్నాయా అన్నది చూడాల్సి ఉంటుంది.
2024 సార్వత్రిక ఎన్నికల్లో జనసేన సాధించిన 100% స్ట్రైక్ రేట్ కి ఏమాత్రం తీసిపోకుండా తాజాగా జరిగిన మేయర్ ఎన్నికల్లో కూడా పొత్తులో భాగంగా జనసేన దక్కించుకున్న విజయవాడ, ఏలూరు 2 మేయర్ స్థానాలను తన ఖాతాలో వేసుకుని మరోసారి 100% స్ట్రైక్ రేట్ సాధించింది జనసేన.
మేయర్, చైర్ పర్సన్, జడ్పీటీసీ, ఎంపీటీసీ…ఇలా జనసేన పోటీ చేసిన అన్ని స్థానాల్లో ఇప్పటి వరకు రాజకీయంగా జనసేన తన హవా కొనసాగించింది. అయితే నాడు కొన్ని చట్టపరమైన కారణాలతో వాయిదాలు పడ్డ మేయర్ స్థానాలతో పాటుగా పంచాయితీ ఎన్నికలకు కూడా సైరన్ మోగడంతో జనసేన తన 100% స్ట్రైక్ రేట్ ను కొనసాగించగలదా.? అన్న ప్రశ్న తలెత్తుతుంది.
తాజాగా బయటకొచ్చిన పవన్ విడాకుల వార్త జనసేన రాజకీయం భవిష్యత్ పై ఎటువంటి ప్రభావం చూపనుంది.? పంచాయితీరాజ్ శాఖ మంత్రిగా పవన్ పడిన రెండున్నరేళ్ల శ్రమ, కృషి పవన్ వ్యక్తిగత వివాదాల మధ్య నలిగిపోనుందా.?
రాజకీయాలలో ప్రజలు నేతల వ్యక్తిగత అంశాలకు ఎంతటి ప్రాధాన్యత నివ్వనున్నారు.? వంటి అనేక ప్రశ్నలకు పంచాయితీ ఎన్నికల్లో జనసేన ఫలితాలే నిదర్శనం కానున్నాయి అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. పొత్తులో భాగంగా జనసేన కాకినాడ, శ్రీకాకుళం మేయర్ స్థానాల్లో పోటీకి సిద్దమయ్యింది.
అయితే జనసేన కాకినాడ మేయర్ అభ్యర్థిగా ఆకుల భవాని, శ్రీకాకుళం మేయర్ అభ్యర్థిగా డా.దానేటి రాధా రాణి రెండు స్థానాలకు గాను పవన్ ఇద్దరినీ మహిళలనే ఎంపిక చేసారు. ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితుల, వ్యక్తిగత వివాదాల దృష్ట్యా ఇప్పుడు జనసేన గెలుపోటములు పవన్ వ్యక్తిగత వివాదాల కేంద్రంగా మారనున్నాయి.
అయితే ఇక్కడ గత ఫలితాల మాదిరే జనసేన గెలుపు యధావిధిగా కొనసాగితే అపుడు ఎటువంటి చర్చకు తావుండదు, కానీ ఒకవేళ ఊహించని విధంగా జనసేనకు ఓటమి ఎదురైతే మాత్రం ఆ ఓటమి ప్రత్యర్థి పార్టీలకు ఒక రాజకీయ అస్త్రంగా మారుతుందనేది ఎవరు కాదనలేని వాస్తవం.
NTR's upcoming film Dragon with director Prashanth Neel could have a major impact on his…
The controversy surrounding the Bharat Summit in Hyderabad has escalated after the BJP filed a…