
ఏపీ, తెలంగాణాలతో పాటు దేశవ్యాప్తంగా వసూళ్ళ గురించి ఇటీవల కాలంలో అఫిషియల్ గా ప్రకటించకపోయినా, ఓవర్సీస్ లో మాత్రం అధికారిక సమాచారం వెలువడుతుంది. నిజానికి ఓ పక్క ప్రీమియర్ షోల బుకింగ్ ప్రారంభమైన సమయం నుండి ప్రతి క్షణం కలెక్షన్స్ అప్ డేట్ అవుతుంటాయి. కానీ, ‘కాటమరాయుడు’ ప్రీమియర్ షోలనే కాదు, ఫస్ట్ డేను కూడా పూర్తి చేసుకుంది. కానీ, ఇంతవరకు ఎలాంటి అధికారిక సమాచారం లేకపోయింది. దీంతో అసలు ఓవర్సీస్ లో ఏమై ఉంటుందా? అన్న ఆతృత అభిమానుల్లో నెలకొని ఉంది.
యుఎస్ కలెక్షన్స్ వివరాల గురించి ప్రముఖ సినీ విశ్లేషకుడు తరుణ్ ఆదర్శ్, ఎప్పటికప్పుడు వివరాలు ప్రకటిస్తూ ఉంటారు. బాలీవుడ్ కు సంబంధించిన వివరాలను తెలిపారు గానీ, ‘కాటమరాయుడు’పై కనీసం ఒక్క హింట్ కూడా ఇవ్వలేదు. కానీ, సోషల్ మీడియాలో మాత్రం ప్రీమియర్ కలెక్షన్స్ వివరాలు 6.50 లక్షల డాలర్స్ గా పేర్కొంటున్నారు, అలాగే ప్రపంచ వ్యాప్తంగా అన్ని రికార్డులను బద్దలు కొడుతూ 24 కోట్ల షేర్ ను వసూలు చేసినట్లుగా ప్రచారం జరుగుతోంది. ఇందులో ఎంత వాస్తవం ఉందో గానీ, సదరు సమాచారం మాత్రం పవన్ ఫ్యాన్స్ కు కావాల్సినంత కిక్ ను పంచుతోంది.
Hyderabad is set to get another premium single-screen theatre. Mythri Movie Makers has taken Dilsukhnagar’s…
Allari Naresh knows exactly what he wants from the audience this time that's laughter, not…