
అయితే ‘అమరేంద్ర బాహుబలి’గా మరొక హీరోను ఊహించుకోవడానికి అసాధ్యం కాని రీతిలో ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో… ఓ ఫోటో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. అవును… ఓ సగటు పవన్ అభిమాని సృష్టించిన ఈ ఫోటోలో అమరేంద్ర బాహుబలిగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దర్శనమిస్తున్నారు. ‘బాహుబలి 2’ పోస్టర్ ను మార్ఫింగ్ చేస్తూ ప్రభాస్ తల స్థానంలో, పవన్ కళ్యాణ్ ఫోటోను పెడుతూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఈ ఫోటో, నెట్టింట వైరల్ అయ్యింది.
బ్లాక్ అండ్ వైట్ లో ఉన్న ఈ ఫోటోలో అమరేంద్ర బాహుబలిగా గడ్డం పెంచుకుని ఉన్న పవన్ లుక్ కూడా మ్యాచ్ కావడంతో, పవన్ ఫ్యాన్స్ షేర్ చేసుకుంటున్నారు. బాగా పాపులర్ అయిన సినిమాలకు ఇలాంటి ఫోటోలను పెట్టి సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తుంటారు. కానీ, పవన్ లుక్ కిక్ ఇచ్చే విధంగా ఉండడంతో ‘ట్రోలింగ్’ బదులు ‘షేరింగ్’ చేస్తూ పవర్ స్టార్ ఫ్యాన్స్ సందడి చేస్తున్నారు. అయితే ‘అమరేంద్ర బాహుబలి’గా పవర్ స్టార్ ఫోటో వరకు ఓకే గానీ, ఇతరత్రా ఊహించుకోవడం మాత్రం కష్టమే!
Nimrit Kaur is redefining raw ethnic elegance with an earthy, unapologetically sultry photoshoot that is…
BOTTOM LINE Thin Story, Patchy Laughs RATING 2/5 Story, Screenplay, Director: Venu Gopal Reddy Cast:…