Telugu

రప్పా రప్పా రంకెలు లేవు… ఇలా మనసులు గెలుచుకుంటే చాలు!

రాజకీయ పార్టీలన్నీ ఏటా సభ్యత్వ నమోదు ప్రక్రియ చేపడుతుంటాయి. పార్టీలను బలోపేతం చేసుకునేందుకు అది అవసరం కూడా.

అలాగే అధికారంలో ఉన్న పార్టీలైతే అభివృద్ధి కార్యక్రమాలో, సంక్షేమ పధకాల పేరుతోనో సభలు సమావేశాలు ఏర్పాటు చేసుకొని డప్పేసుకుంటాయి. ఇదీ అవసరమే.

ADVERTISEMENT

ఏటా పార్టీల వ్యవస్థాపక దినోత్సవాలు జరుపుకోవడం ద్వారా మైలు రాళ్ళ లెక్కించుకుంటాయి. వీటన్నిటి లక్ష్యం ప్రజల అభిమానం పొంది ఎన్నికలలో విజయం సాధించడమే.

అయితే జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ తీరు ఇందుకు పూర్తి భిన్నంగా ఉంటుంది. పవన్ కళ్యాణ్‌ తలుచుకుంటే విజయవాడ, విశాఖ, తిరుపతిలోనో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి పార్టీ వ్యవస్థాపక దినోత్సవం అట్టహాసంగా చేసుకోవచ్చు. ఆయన సభ అంటే జనసైనికులు, అభిమానులు స్వచ్చందంగానే తరలివస్తారు కూడా.

కానీ పవన్ కళ్యాణ్‌ నేడు అల్లూరి సీతారామరాజు జిల్లాలోని పాడేరులో ఓ మారుమూల గిరిజన ఇన్‌స్టాగ్రామ్‌ ఓనూరులో గిరిజనుల సమక్షంలో జనసేన జెండా ఎగురవేసి చాలా నిరాడంబరంగా పార్టీ 13వ వ్యస్థాపక దినోత్సవం జరుపుకున్నారు.

అంతకంటే ముందు గిరిజనులకు ఇచ్చిన మాట ప్రకారం ఏజన్సీ ప్రాంతంలో మారుమూల గ్రామాలను కలుపుతూ బీటీ రోడ్ వేయించారు. ఆ రోడ్డు నాణ్యతని పరిశీలించేందుకు గ్రామం వరకు కాలినడకన సాగుతూ దారిలో కనిపించిన గిరిజనులను పలకరిస్తూ వారి కష్టసుఖాలు తెలుసుకుంటూ ముందుకు సాగారు.

ఎన్నికల సమయంలో తప్ప ఎవరూ ఇక్కడికి రావడానికి ఇష్టపడరని, తమ సమస్యలను వినే నాధుడు లేరని గిరిజనులు పవన్ కళ్యాణ్‌ చెప్పారు. కానీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ వచ్చినందుకు గిరిజనులు చాలా సంతోషం వ్యక్తం చేశారు.

పవన్ కళ్యాణ్‌ అంత నిరాడంబరంగా తమతో కూర్చొని మాట్లాడటం, తమ ప్రతీ సమస్యని సావధానంగా విని, అక్కడిక్కడ అధికారులకు ఆదేశాలు జారీ చేస్తుండటం చూసి ఇది కలా నిజమా?అని గిరిజనులు ఆశ్చర్యపోతూ ఆయన వెంట నడిచారు.

ప్రజాధరణ పొందేందుకు భారీ సభలు, హడావుడి అవసరమే లేదని, ఇలా కూడా పొందవచ్చని పవన్ కళ్యాణ్‌ నిరూపించి చూపారు. సామాన్య ప్రజల కష్టాలు, సమస్యలు, కోరికలు పెద్దవేం కావు. వాటిని తీర్చడం ప్రభుత్వాలకు కష్టం కాదని పవన్ కళ్యాణ్‌ నిరూపించి చూపారు.

ప్రతీ రాజకీయ నాయకుడు ఇలా ప్రజలతో మమేకం అయితే, వారి చిన్న చిన్న సమస్యలని తీర్చితే ఆ ప్రజలే వారిని గుర్తుపెట్టుకొని మరీ అందలం ఎక్కిస్తారు కదా? ఈ మాత్రం దానికి రప్పారప్పా అంటూ రోడ్లపై రంకెలు వేయడం అవసరమా?

కొందరికి రాజకీయాలంటే పదవి, అధికారం, డబ్బు, ఆస్తులు, పేరు ప్రతిష్టలు. కానీ ప్రజలకు సేవ చేయడానికే రాజకీయాలని పవన్ కళ్యాణ్‌ భావిస్తారు. అదే.. నేడు ఇలా చేతలలో చూపారు.

మారుమూల గ్రామాలకు పవన్ కళ్యాణ్‌ పర్యటనలు, చేయిస్తున్న ఈ అభివృద్ధి పనులు, గిరిజనులతో మాటామంతీ వచ్చే ఎన్నికలలో జనసేనని గెలిపించకుండా ఉంటాయా? ఇంతకంటే గొప్ప రాజకీయం ఏముంది?

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

No Restriction On KTR’s Passport, Foreign Travel?

Earlier there were multiple unverified media reports about the ACB court potentially looking at impounding…

4 minutes ago

Mammootty vs Dulquer: Rare Father-Son BO Clash!

November 20 could witness an interesting box-office battle, with Mammootty and Dulquer Salmaan finding themselves…

34 minutes ago