
పవన్ ఓటమి కోసమే నా ఈ జన్మ అన్నట్టుగా ప్రవర్తిస్తున్న ముద్రగడ పద్మనాభం కు సంస్కారవంతమైన దెబ్బ కొట్టారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ముద్రగడ కుమార్తె క్రాంతి తన భర్తతో కలిసి నిన్న జరిగిన తుని వారాహి యాత్రలో పాల్గొన్నారు. తాను తన తండ్రి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నాని ప్రకటించి పవన్ కు మద్దతు తెలియచేసారు.
పవన్ గెలుపు కోసం తనవంతు కృషి చేస్తానంటూ ప్రకటించిన క్రాంతి పవన్ ను కలిసి జనసేనకు అండగా నిలబడతామని హామీ ఇచ్చారు. అయితే వైసీపీని ముద్రగడ ను దెబ్బ కొట్టడానికి వచ్చిన సువర్ణ అవకాశాన్ని తాత్కాలికంగా, సున్నితంగా పక్కన పెట్టిన పవన్ తానూ కులాలను, పార్టీలను, కుటుంబాలను కలిపే వ్యక్తినే కానీ ఇలా తండ్రి, కూతురులను వేరు చేసి రాజకీయ లబ్ది పొందే వ్యక్తిని కాదంటూ సభా ముఖంగా క్రాంతికి తన అభిప్రాయాన్ని వెల్లడించారు.
మీ కుటుంబంలో వచ్చిన చీలికను నా రాజకీయ స్వార్దానికి వాడుకున్నాను అనే అపవాదు నాకొద్దు, ఈ ఎన్నికల తరువాత మీ తండ్రి గారి సమక్షంలో మీతో కలిసి మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని జనసేనలోకి ఆహ్వానిస్తా అంటూ తుని సభ సాక్షిగా క్రాంతి హామీ ఇచ్చారు పవన్. తనను ఇంతలా ద్వేషిస్తూ తన ఓటమి కోసం కులాన్ని కించపరుస్తూ, పెద్దరికాన్ని తాకట్టు పెడుతూ, తన అనుభవానికి, వయస్సుకి ఉన్న విలువ తగ్గించుకుంటూ పద్మనాభం చేస్తున్న విమర్శలకు పవన్ స్పందించిన తీరు అన్ని వర్గాల ప్రజలలో పవన్ పట్ల గౌరవాన్ని రెట్టింపు చేసింది.
అలాగే పవన్ తన వ్యక్తిత్వం తో ముద్రగడ స్థాయిని ఒక్కసారిగా పాతాళానికి పడేసారు. ఇప్పటికైనా తన వారు ఎవరో, పరాయి వారు ఎవరో తెలుసుకుంటే కనీసం ఆయన వయస్సుకైనా విలువుంటుంది అంటున్నారు పవన్ అభిమానులు. ఇటువంటి అవకాశం వైసీపీ కి వస్తే ఇదే అదునుగా ప్రత్యర్థి వర్గాన్ని చీల్చి చెండాడేవారు. కానీ పవన్ తనకొచ్చిన అవకాశాన్ని కూడా వదులుకుని విలువలతో కూడిన రాజకీయం చేయడానికి కడ్డుబడడం నిజంగా హర్షించదగ్గ పరిణామమే.
ఏది ఏమైనప్పటికీ ప్రత్యర్థులను దెబ్బ కొట్టడంలో పవన్ ఇదో రకం స్టాటజీని ఎంచుకోవడం అంటే ‘కర్ర విరగకుండా పాముని చంపినట్టే’ అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. పవన్ ను ఎలా అయిన రెచ్చగొట్టి ముద్రగడ మీద విమర్శలు చేసి కాపు సామజిక వర్గం ఓట్లను చీల్చి పవన్ ను ఓడించాలి అని ఆశ పడిన వైసీపీకి పవన్ కొట్టిన దెబ్బ తమలపాకుతో అయినా గాయం మాత్రం గట్టిగానే తగిలేలానే ఉంది.
Aadarsha Kutumbam - AK47 was recently postponed again, and there is still no clarity about…
The USCIS has officially removed the 540-day automatic extension granted to H-4 visa holders with…