
గతంలో ఇదే పవన్ కళ్యాణ్ ఒకసారి రుజువులు ఉన్నాయని, ఇంకోసారి రుజువులేమీ లేవని అందరు అనుకుంటుంటే చుసుకోమని మాత్రమే చెప్పా అని చెప్పుకొచ్చారు. ఇప్పుడు మళ్ళీ ఆధారాలు ఉన్నాయని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు. ఇలా ఇన్ని మాటలు ఎందుకు? ఆ రుజువులు ఏంటో ప్రజల ముందు పెడితే వారే నిర్ణయిస్తారు కదా?
రుజువులు ఉన్నాయి కానీ సరైన సమయంలో బయటపెడతా అని తెప్పించుకునే రొటీన్ రాజకీయనాయకుడిలా పవన్ కళ్యాణ్ ఎందుకు వ్యవహరిస్తున్నారు? మరోవైపు హోదా సాధన పోరాటంలో భాగంగా సీపీఐ, సీపీఎంలతో కలిసి ఏప్రిల్ 6న జాతీయ రహదారులపై శాంతియుత పద్ధతుల్లో నిరసనలకు పిలుపునిస్తున్నామన్న పవన్.. 6న తాను కూడా విజయవాడలో పాదయాత్ర చేస్తానని తెలిపారు.
Yash's Toxic was sold as a pan-India and global event, but its overseas performance is…
Dulquer Salmaan's I'm Game directed by Nahas Hidhayath, is all set to hit the screens…