
“ఇటీవల తాను దంగల్ సినిమా చూశానని, తన అభిప్రాయాన్ని వ్యక్తీకరించకుండా ఉండలేకపోతున్నానని, అమీర్ ఖాన్ అద్భుతమైన నటనతో ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది హృదయాలను గెలుచుకున్నారని” పవన్ ట్వీట్ చేశారు. అంతేకాదు, అంత గొప్ప నటుడు భారతీయుడు కావటం మనకు గర్వకారణమని, ఈ సినిమాకు పనిచేసిన ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణులకు తన అభినందనలు తెలుపుతున్నట్లు చెప్పారు.
ఈ సినిమా దర్శకుడు నితీష్ తివారీ ఈ సినిమా కథను ఎంతో చక్కగా ప్రేక్షకుడు కథలో లీనమయ్యేలా తీశారని, ఈ సినిమాలో బబితా ఫొగట్‑గా నటించిన సుహానీ భట్నాగర్, సన్యా మల్హోత్రాలకు, గీతా ఫొగట్ పాత్రలో నటించిన జైరా వసీం, ఫాతిమా సనా షేక్ లకు తన ప్రత్యేక అభినందనలు తెలుపుతున్నట్లు చెప్పారు. ఈ చిత్రం స్త్రీ సాధికారత గురించి మనందరినీ మరోసారి ఆలోచించేలా చేసిందని పవన్ పేర్కొన్నారు.
For an actor, a face and voice are more than just part of their identity.…
BOTTOM LINE Dead Game! RATING 1.75/5 Director: Nahas Hidhayath Story, Screenplay: Nahas Hidhayath, Sajeer Baba…