Telugu

చిర్రి బాలరాజు…ఒక్క ఛాన్స్ తో సరిపెట్టుకుంటారా.?

పోలవరం జనసేన ఎమ్మెల్యే చిర్రి బాలరాజు వ్యవహారం జనసేన కు పెద్ద తలనొప్పిగా మారింది. అధికార పార్టీలో ఉన్న ఎమ్మెల్యే గా బాలరాజు పై అటు మీడియాలో ఇటు సోషల్ మీడియాలో వస్తున్న కథనాలు, ఆరోపణల పై విచారణ జరిపేందుకు జనసేన అధ్యక్షుడి హోదా లో పవన్ కళ్యాణ్ ఒక హై లెవెల్ కమిటీని నియమించినట్టు జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి అధికారిక ప్రకటన విడుదలయ్యింది.

ఈ ప్రకటనలో ముఖ్యంశాలు పరిశీలిస్తే….గత కొంతకాలంగా పోలవరం జనసేన ఎమ్మెల్యే గా ఉన్న మర్రి బాలరాజు వ్యవహారం పై అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తీవ్ర అసంతృప్తితో ఉన్నారని, గతంలో మంగళగిరి పార్టీ కేంద్ర కార్యాలయానికి పిలిపించి గిరిజనుల సేవ పై ద్రుష్టి పెట్టాలని,

ADVERTISEMENT

పారదర్శకమైన, నీతివంతమైన పాలన అందించాలని హెచ్చరించినా బాలరాజు వ్యహారశైలిలో ఎటువంటి మార్పు కనిపించకపోవడంతో పవన్ విసుగు చెందారంటూ చాల కఠినమైన పదాలనే ప్రయోగించింది జనసేన.

ఒకపక్క పవన్ అడవితల్లి బాట అంటూ గిరిజన ప్రాంతాల ప్రజల కోసం, వారి అభివృద్ధి మార్గాల కోసం పనులు నిర్వహిస్తుంటే మరోపక్క అదే గిరిజన ప్రాంతం నుంచి ఎన్నికైనా సొంత పార్టీ ఎమ్మెల్యే ఇలా అవినీతి ఆరోపణలు ఎదుర్కుంటూ పార్టీకి నష్టం చేకూర్చడంతో పవన్ బాలరాజు పై హై లెవెల్ కమిటీని వేశారు. అలాగే ఆ కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా తదుపరి చర్యలుంటాయని హెచ్చరించారు.

బాలరాజు అవినీతి అంటూ ఇప్పటికే మీడియాలో పలు కథనాలు ప్రచారమయ్యాయి. ఇటు సోషల్ మీడియాలో సైతం లీకుల రూపంలో బాలరాజు ఆడియో సంభాషణలు బయటకొచ్చాయి. 2024 ఎన్నికలలో టీడీపీ, బీజేపీ, జనసేన పొత్తులో భాగంగా పోలవరం ఎమ్మెల్యే సీటు దక్కించుకున్న బాలరాజు తనకొచ్చిన ఈ అవకాశాన్ని ఇటువంటి అవినీతి ఆరోపణలతో ఒక ఛాన్స్ గా మార్చుకోనున్నారా.?

కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా చర్యలు తప్పవు అంటూ ఇప్పటికే పవన్ ప్రకటించడంతో బాలరాజు రాజకీయ భవిష్యత్ పై ఉత్కంఠ నెలకొంది. బాలరాజు వ్యహారం పై పవన్ తీసుకోపోయే నిర్ణయాలు మిగిలిన జనసేన ఎమ్మెల్యేలకు, నాయకులకు ఒక ఎలర్ట్ వార్నింగ్ కానుందా.?

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

వైసీపీ గోడమీద పిల్లి పాత్ర పోషిస్తుందా.?

సర్ ప్రక్రియలో అవకతవకలు, ఆ ప్రక్రియ ద్వారా దేశంలో రాజ్యాంగ ఉల్లంఘన జరుగుతుంది, కేంద్ర ప్రభుత్వం అప్రజాస్వామ్యంగా వ్యవహరిస్తోంది, కేంద్ర…

5 minutes ago

J.D. Vance Pauses PERM: Lawyers Question Gov Data

J.D. Vance has targeted multiple companies in his largescale immigration crackdown. Microsoft, TCS, Cognizant, and…

56 minutes ago