
“గడిచిన ఆరేళ్ళల్లో పవన్ కళ్యాణ్ 75 కోట్లు సంపాదించారని, అందులో 25 కోట్లు పన్నుల రూపేణా చెల్లించారని, ఇంత నిజాయితీ గల నాయకుడు మనకు మరెక్కడైనా దొరుకుతాడా?” అంటూ సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. అంటే సంపాదించిన మొత్తంలో 33 శాతం పన్నుల రూపంలో పవన్ కళ్యాణ్ చెల్లించారన్న మాట. నిజమే… పవన్ ఇంత పన్ను చెల్లించి ఉంటే గనుక గొప్ప విషయమే. పెద్ద తలకాయలు పన్నులు తప్పించుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారన్నది బహిరంగమే.
అయితే అందుకు విరుద్ధంగా పవన్ నిజంగా పన్ను చెల్లించడం అనేది ఆహ్వనించదగ్గ పరిణామమే. ప్రజల్లో పవన్ పట్ల ఉన్న నిజాయితీ వైఖరినే హైలైట్ చేస్తూ ప్రచారం చేస్తుండడం ‘జనసేన’ పక్కా ప్లానింగ్ తో వ్యవహరిస్తోందని చెప్పవచ్చు. ప్రస్తుతం అందరి చూపులు నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా బహిరంగ ప్రదేశంలో పవన్ నిర్వహించనున్న సభ వైపుకే చూస్తున్నాయి. ఈ సభలో పవన్ ఏం చెప్పబోతున్నారనేది 2019 ఎన్నికలలో అత్యంత కీలకం కానుందని పొలిటికల్ వర్గాలు పేర్కొంటున్నాయి.
From Rocky Bhai to Raya, Yash has delivered a bona fide disaster with Toxic.…
Yash's Toxic was sold as a pan-India and global event, but its overseas performance is…