
ఎప్పుడో చనిపోయింది కదా ఆమె గురించి పెద్దగా తెలియదేమో… బహుశా ఛార్మిలాగా కొంచెం కొంచెం డ్రెస్సులు వేసుకుని డ్యాన్స్ లు వేసే ఆమె అనుకున్నారేమో అంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించిన పోసాని, వచ్చే ఎన్నికలలో తన ఓటు వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డికేనని స్పష్టంగా వెల్లడించారు. ఒకవేళ కోర్టులు జగన్ ను దోషిగా తేల్చి, జైలుకు పంపిస్తే తన ఓటును మార్చుకుంటాను తప్ప, లేకపోతే మరొకరికి వేయనని, ఉన్న నాయకులలో తనకు జగన్ ‘ది బెస్ట్’ అంటూ కితాబిచ్చారు.
ఇక పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ… తనకు 23 ఏళ్ళ కొడుకు ఉన్నాడు, ఎలాంటి అలవాట్లు లేవు, అలాగే తన సతీమణి కూడా చాలా మంచిది, కొడుకును ముఖ్యమంత్రి, భార్యను ప్రధానమంత్రి చేస్తానా? అంటూ పరోక్షంగా పవన్ కళ్యాణ్ కు ముఖ్యమంత్రి అయ్యే లక్షణాలు లేవని చెప్పుకొచ్చారు. చాలా మీడియా ఛానల్స్ ఉన్నాయి, దేనికుండే క్వాలిటీ దానికుంటుంది… పవన్ కళ్యాణ్ ఇప్పటివరకు రాజకీయాల్లోకి రాలేదు. అయితే పవన్ కళ్యాణ్ కు అసలెందుకు ఓటేయాలి అని అడుగుతున్నా… అన్న ప్రోమోలతో కూడిన వీడియోలను సదరు మీడియా ఛానల్ విడుదల చేసింది. ఈ పూర్తి ఇంటర్వ్యూ ఆదివారం నాడు ప్రసారం కానుంది.
A social media user who posted a meme about Yash's Toxic on August 26 has…
కాంగ్రెస్ పార్టీని ఎవరూ ఓడించలేరు. కాంగ్రెస్ నేతలే తమ పార్టీని గద్దె దించుకోవాలని నిర్ణయించుకున్నప్పుడు, ఇతర పార్టీలు ఎన్నికలలో గెలిచి…