Telugu

రీమేక్ సవాలుని త్రివిక్రమ్ – సముతిరఖనిలు దాటినట్టేనా?

ఓటిటి ప్రపంచంలో థియేటర్ సినిమా కోసం రీమేక్ ఎంచుకోవడం అతి పెద్ద రిస్కు. ఒకప్పుడు ఏమో కానీ ఇప్పటి ఆడియన్స్ బాగా తెలివి మీరిపోయి ఒరిజినల్ వెర్షన్లు వెతికి మరీ చూస్తున్నారు. అందుకే బ్రో మీద ఫ్యాన్స్ మరీ అతి అంచనాలు పెట్టుకోలేదు. రిలీజ్ ఇంకో వారమే ఉన్నా సాధారణంగా ఉండాల్సిన ఎగ్జైట్ మెంట్ సోషల్ మీడియాలో లేదు. అందుకే అందరి కళ్ళు ట్రైలర్ మీదే పడ్డాయి.

పవన్ కళ్యాణ్ ని ఎలా చూపిస్తే అభిమానులకు కిక్ వస్తుందో సముతిరఖని, రచయిత త్రివిక్రమ్ శ్రీనివాస్ సరిగ్గా పసిగట్టారు. కేవలం రెండు నిమిషాల వీడియోనే అయినప్పటికీ సరిగ్గా టార్గెట్ ని చూసి బాణం విసిరారు. జల్సా, తమ్ముడు, తొలిప్రేమ నాటి వింటేజ్ పవర్ స్టార్ ని బయటికి తేవడంతో సహజంగానే ఆసక్తి పెరుగుతుంది. వినోదయ సితం కథ కాబట్టి పెద్దగా దాచే ప్రయత్నం ఏదీ చేయలేదు.

ADVERTISEMENT

మార్క్ అలియాస్ మార్కండేయ అనే ఉద్యోగి జీవితంలో టైం సరిపోక దాన్ని తిట్టుకుంటున్న పరిస్థితిలో సమయం మనిషి రూపంలో వచ్చి అతనికి ఎన్నో విలువైన పాఠాలను, లైఫ్ లోని అసలు రుచిని నేర్పిస్తాడు. అతనే బ్రో. కొంచెం గోపాల గోపాల షేడ్ ఉన్నప్పటికీ ఇది పూర్తిగా డిఫరెంట్ లైన్. తమిళంలో ఇద్దరు క్యారెక్టర్ ఆర్టిస్టులు చేసిన పాత్రలను ఇక్కడ హీరోలకు అనుగుణంగా మార్చడం సవాలే.

మనుషులు తమ తల మీద తామే చేయి పెట్టుకుని నాశనమయ్యే భస్మాసుర సంతతనే డైలాగుతో మొదలుపెట్టి చచ్చి బ్రతికాను బ్రతికాక చస్తున్నాను అంటూ గురూజి మార్కు చమక్కులు గట్టిగానే దట్టించినట్టున్నారు. పాటల విషయంలో నెగటివ్ ఫీడ్ బ్యాక్ అందుకున్న తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాత్రం జాగ్రత్తగా కంపోజ్ చేసుకున్నాడు. థీమ్ ని క్యారీ చేస్తూ మంచి సౌండ్ అయితే ఇచ్చాడు.

అంతా బాగానే ఉంది కానీ రెండుంపావు గంటలు బ్రో ఇదే ఎనర్జీతో ఉంటేనే బ్లాక్ బస్టర్ పడుతుంది. హైప్ విపరీతంగా లేకపోవడం ఒక ప్లస్ కాగా పవన్ తేజుల కాంబో మీద ఫ్యాన్స్ ఎక్కువ ఊహించేసుకోవడం కొంత బ్రేక్ గానూ అడ్డు పడొచ్చు. కామెడీ, ఎమోషన్లు పుష్కలంగా ఉన్నట్టు ఫీలిచ్చిన బ్రో అసలైన కమర్షియల్ మసాలా జోలికి మాత్రం వెళ్లినట్టు లేదు. ఈ ఒక్క అంశం కొంత ప్రభావం చూపొచ్చు.

ఏపీలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల దృష్ట్యా బ్రోకు దక్కే స్పందన పట్ల ప్రేక్షకులు ఆసక్తిగా ఉన్నారు. సినిమా హిట్ కావడం కాకపోవడం పాలిటిక్స్ కి సంబంధం లేకపోయినా వారాహి జోష్ లో ఉన్న జనసేన ఫాలోయర్స్ కి బ్రో సానుకూల ఫలితం ఇంకొంత ఉత్సాహాన్ని జోడిస్తుంది. ఇంకో కొత్త సినిమా ఏ ఆరేడు నెలలకు వస్తుందో లేక ఎన్నికల తర్వాత రిలీజవుతుందో తెలియదు కాబట్టి బ్రో మీదే ఆశలన్నీ.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Nagarjuna Surprised After Watching Itllu Arjuna

Nagarjuna has decided to present the film Itllu Arjuna under his Annapurna Studios banner after…

4 minutes ago

మిగులు విద్యుత్ దశకు ఏపీ, విద్యుత్ సంక్షోభంలో తెలంగాణ!

రాష్ట్ర విభజన తర్వాత పదేళ్ళపాటు తెలంగాణ రాష్ట్రం శరవేగంగా అభివృద్ధి చెందగా, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి బ్రేకులు వేసినట్లు ఐదేళ్ళపాటు అభివృద్ధి…

22 minutes ago