
‘కొడకా కోటేశ్వరావా’ అనే ఈ పాట ఆ చిత్రం ఆల్బమ్ కే హైలైట్ అంట. గతంలో కూడా పవన్ కళ్యాణ్ తన చిత్రాల కోసం పాటలు పాడారు. త్రివిక్రమ్ పవన్ కళ్యాణ్ ‘అత్తారింటికి దారేది’ చిత్రంలో ఆయన పాడిన కాటమ రాయుడా పాట ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే. అయితే ‘కొడకా కోటేశ్వరావా’ అనే ఈ పాటను ఆ చిత్ర వర్గాలు దృవీకరించాల్సి ఉంది.
ఆ చిత్రం యొక్క చివరి షెడ్యూల్ హైదరాబాద్ లో జరుగుతుంది. ఈ నెలాఖరు లేదా డిసెంబర్ మొదటి వారంలో ఆ షెడ్యూల్ పూర్తి అవుతుందంట. దాని తరువాత పవన్ కళ్యాణ్ పూర్తి సమయం తన జనసేన పార్టీ కార్యకలాపాలకే వినియోగించనున్నారు. 2019 ఎన్నికల కోసం సమాయత్తం అవుతారు.
Nagarjuna’s latest film promotion has turned into another platform for Bigg Boss Telugu 10 viewers…
YS Jagan Mohan Reddy left Pulivendula without voting after alleging large-scale irregularities during the municipal…