Telugu

మార్క్ శంకర్ వైరల్ పిక్…

నిన్న సింగపూర్ స్కూల్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో గాయపడిన పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ ప్రస్తుతం ఎలా ఉన్నాడు అనే ఆందోళన సర్వత్రా నెలకొంది.

అయితే నిన్నటి ప్రమాద దృశ్యాలు మీడియాలో రావడంతో ప్రమాద తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్ధమయింది. దట్టమైన నల్లని పొగతో ఆ ప్రాంతమంతా మసగబారిపోయిందా అన్నట్టుగా అక్కడి వాతావరణం మారిపోయింది.

ADVERTISEMENT

దీనితో అసలు పవన్ కుమారుడు ఎలా ఉన్నాడు అనే ఆందోళన ఇంకాస్త పెరిగింది. అయితే అందుకు గాను బాబు చికిత్స పొందుతున్న ఒక పిక్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

చేతికి కట్టు, ఆక్సిజన్ మాస్క్ తో ఉన్న మార్క్ ఫోటో ఒకటి బయటకొచ్చింది. దీనితో ప్రస్తుతం మార్క్ ఎలా ఉన్నాడో అన్న ఆందోళన లో ఉన్న పవన్ అభిమానులు ఈ బాబు పిక్ ను వైరల్ చేస్తున్నారు.

ఈ పిక్ గమనిస్తే మార్క్ ఆరోగ్య పరిస్థితి మరి అంత ప్రమాదకరం లేదని, ఆందోళన చెందాల్సిన అవసరం లేనట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం బాబు క్షేమంగానే ఉన్నట్టుగా ఆ పిక్ లో కనిపిస్తుంది.

అయితే అగ్నిప్రమాద గాయాల నుంచి మార్క్ కోలుకుంటున్నాడని, కాకపోతే మరో రెండు రోజుల పాటు బాబును ఆబ్సెర్వేషన్ లో ఉంచాలంటూ వైద్యులు మార్క్ ను జనరల్ వార్డ్ కు షిఫ్ట్ చేసినట్టు సమాచారం.

అలాగే మార్క్ ను చూడడానికి పవన్ తో పాటుగా చిరంజీవి, సురేఖ కూడా సింగపూర్ వెళ్లిన సంగతి తెలిసిందే. ఇక బాబు ఆరోగ్య పరిస్థితి పై అటు రాజకీయ, ఇటు సినీ ప్రముఖులు కూడా పవన్ కు అండగా నిలిచారు.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

సుప్రీం తీర్పుపై సిఎం స్పందన…పెర్ఫెక్ట్

ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు ఇవ్వడం కుదరదంటూ సుప్రీంకోర్టు తీర్పు చెప్పిన నేపధ్యంలో సిఎం…

13 minutes ago

Bowling Like His Prime Days: Still Out! Selection Bias

Mohammed Shami is still hoping for another chance to play for Team India, and his…

36 minutes ago