
తాను పొరపాటుగా పవన్ కళ్యాణ్ పై మాట్లాడానని, దీనికి పవన్ కళ్యాణ్ అభిమానులు తనను మన్నించాలని కోరింది. ఈ ఉదంతం తర్వాత మైక్ అందుకున్న శ్రీరెడ్డి తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తపరిచింది. నిన్నొక మాట, ఈ రోజొక మాట చెప్పేవాళ్ళు ఇక్కడ ఉండవద్దని, అభిమానం, భయం ఉంటే తన పోరాటంలో నిలవవద్దని నటి శృతి, అపూర్వలపై మండిపడింది. ఇది తాను ప్రారంభించిన ఉద్యమమని, ఎవరైనా నీరుగారిస్తే ఊరుకోనని తెగేసి చెప్పింది.
ఆ తర్వాత ఈ వేదికపై నుండి పవన్ కళ్యాణ్ అభిమానులపై మహిళా లోకం విమర్శల వర్షం కురిపించింది. అభిమానం పేరుతో ఎవరైనా బెదిరింపులకు పాల్పడితే ఊరుకునేది లేదని, కనీసం అభిమానులను కూడా పవన్ కళ్యాణ్ కంట్రోల్ లో పెట్టుకోలేరా అంటూ ధ్వజమెత్తారు. పవన్ కళ్యాణ్ పై ఆరోపణలు చేసిన నాటి నుండి నటి శృతికి బెదిరింపు కాల్స్ వస్తున్నాయని, ఎప్పుడు ఎవరి పేరు బయటకు వస్తుందోనని అంతా భయపడుతున్నారని విమర్శించారు.
తమకు వ్యక్తిగతంగా ఎవరి మీద కక్ష్య లేదని, ఇది సినీ ఇండస్ట్రీ కోసం, మహిళల హక్కు కోసం జరుగుతున్న పోరాటం అని, ఇందుకు ఏ హీరో గానీ, ఏ హీరో అభిమానులు గానీ అడ్డొచ్చినా సహించేది లేదని, ఒక పెద్ద సినిమా రిలీజ్ అయితే ట్వీట్లు పెట్టే పెద్ద హీరోలంతా ఇంతమంది అమ్మాయిలు రోడ్డు మీదకు వస్తుంటే ఎందుకు కనీసం నోరు కూడా మెదపడం లేదంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. ఇది ఇక్కడితో ఆగేది కాదని ఓ స్పష్టమైన ప్రకటన చేసారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీలు మెజార్టీ సీట్లు దక్కించుకుంటే వార్త అవుతుంది తప్ప అధికార పార్టీ దక్కించుకుంటే కాదు.…
A Simbu film usually creates enough curiosity, but the latest buzz around his next project…