ఆ పేటెంట్ హక్కులు పవన్ కళ్యాణ్‌కు బదిలీ చేయాల్సిందే!

పవన్ కళ్యాణ్‌ జనసేనతో రాజకీయాలలో ప్రవేశించినప్పుడు అందరూ పెదవి విరిచారు. అన్న చిరంజీవి ఫెయిల్ అయితే తమ్ముడు ఏం చేయగలడని ప్రశ్నలు, విమర్శలు వినిపించాయి.

“రాజకీయాలలో ఢక్కా మొక్కీలు, ఎదురుదెబ్బలు అన్నిటికీ సిద్దపడే వచ్చాను. చివరి వరకు ఇదే మాటకి కట్టుబడి ఉంటాను.. తగ్గేదేలే..” అని పవన్ కళ్యాణ్‌ పదేపదే చెపుతున్నప్పటికీ ఎవరికీ ఆయన మాటలపై నమ్మకం కలగలేదు. రొటీన్ డైలాగ్స్ చెపుతున్నారనే అందరూ అనుకున్నారు.

ADVERTISEMENT

కానీ చాలా మంది రాజకీయ నాయకుల కంటే పవన్ కళ్యాణ్‌ తనకి చాలా పట్టుదల ఉందని నిరూపించి చూపారు. ఈ సుదీర్గ రాజకీయ ప్రస్థానంలో పవన్ కళ్యాణ్‌ కొన్ని తప్పటడుగులు కూడా వేసినప్పటికీ, అవన్నీ లక్ష్యం చేరుకునేందుకు చేసిన విఫల ప్రయత్నాలే అని సరిపెట్టుకోవచ్చు.

ముందే చెప్పిన్నట్లు పవన్ కళ్యాణ్‌ అనేక ఆర్ధిక సమస్యలు, రాజకీయ ఒత్తిళ్ళు, అవమానాలు, అగ్ని పరీక్షలు అన్నిటినీ నిబ్బరంగా ఎదుర్కొంటూ చివరికి ఏపీ ఉప ముఖ్యమంత్రిగా తన లక్ష్యం సాధించారు.

ఈ నేపధ్యంలో ‘కూటమిలోనే జనసేన కొనసాగుతుందని, కిందా మీదా పడ్డా కూటమిని విడిచిపెట్టే ప్రసక్తే లేదని’ పవన్ కళ్యాణ్‌ నిన్న శాసనసభలో చెప్పడం చూస్తే, కూటమిలో ఐక్యత, పొత్తుల విషయంలో కూడా పవన్ కళ్యాణ్‌కి పూర్తి స్పష్టత ఉందని అర్దమవుతుంది.

కనుక పవన్ కళ్యాణ్‌ ఇప్పటి వరకు చెప్పిన ప్రతీ మాటకు ఎలా కట్టుబడి ముందుకు సాగారో, కూటమి విషయంలో కూడా అలాగే కలిసి సాగుతారని నమ్మవచ్చు.

కూటమి ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్‌ ఇంత కీలకంగా ఉన్నప్పటికీ ఇంత అంకితభావం, విశ్వసనీయత చూపుతుండటం చాలా హర్షణీయం.

టీడీపీ నేతలు కూడా జనసేన పట్ల ఇదేవిదంగా సానుకూలంగా మాట్లాడటం చాలా అవసరం. ఇటువంటి మాటలతోనే టీడీపీ-జనసేన బంధం మరింత బలపడుతుంది. సహృద్భావం పెరుగుతుంది. అప్పుడు అవసరమైతే ఒకరి కోసం ఒకరు త్యాగాలు చేసుకోవడానికి వెనుకాడకపోవచ్చు.

ఎప్పటికైనా పవన్ కళ్యాణ్‌, చంద్రబాబు నాయుడు లేదా పవన్ కళ్యాణ్‌-నారా లోకేష్‌ మద్య చిచ్చుపెట్టి కూటమి విచ్చినం అయ్యేలా చేసి మళ్ళీ అధికారంలోకి రావాలనే జగన్‌కి ఆ చిన్న ఆశ కూడా లేకుండా చేశారు పవన్ కళ్యాణ్‌.

జగన్‌లా ‘మాట తప్పను.. మడమ తిప్పను.. విలువలు, విశ్వసనీయత వంటి డైలాగులకే పరిమితం కాకుండా పవన్ కళ్యాణ్‌ నిజంగానే వాటికి కట్టుబడి ఉంటారని నిరూపించుకున్నారు.

కనుక జగన్‌ ఇకపై వాటి పేటెంట్ హక్కులు పవన్ కళ్యాణ్‌కి బదిలీ చేసేసి అధికారం కోసం మరోదారి వెతుక్కోవలసిందే!

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Is AA23 in Trouble? Allu Arjun’s Camp Responds

Reports about Allu Arjun and Lokesh Kanagaraj’s AA23 hitting a roadblock have created fresh confusion…

45 minutes ago

Reporting Live Review: An Absolute Disaster, Nothing Works

BOTTOM LINE An Absolute Disaster, Nothing Works PLATFORM Netflix RUNTIME 2 Hours What Is the…

1 hour ago