
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ vs వైసీపీ మధ్య సైద్ధాంతిక విభేదాలు తూర్పు – పడమర మాదిరి ఎప్పుడు రెండు భిన్న దిక్కులే. ఒకరు రాష్ట్ర ప్రయోజనాల కోసం రాష్ట్రాభివృద్ధి కోసం తానూ తగ్గినా, పార్టీ స్థాయిని తగ్గించినా పర్వాలేదు అనుకుని ఆచితూచి అడుగేసేవారైతే,
మరొకరు రాష్ట్రం కోసం కాదు కదా కనీసం తన పార్టీ నేతల రాజకీయ భవిష్యత్ కోసం కానీ, పార్టీ క్యాడర్ బాగు కోసం కానీ, చివరికి సొంత తల్లి, చెల్లి కోసం కూడా తగ్గేదెలా అన్నట్టుగా దూకుడుగా ముందుకెళ్ళేవారు. ఇందులో ఒకరికి రాష్ట్ర భవిష్యత్ ముక్యమైతే మరొకరికి పార్టీ అధికారమే లక్ష్యం.
ఇలా ఈ ఇద్దరు నేతలు, రెండు పార్టీలు తగ్గినా తప్పులేదని ఒకరు, తగ్గేదెలా అని మరొకరు ముందుకెళుతున్న తరుణంలో జనసేన అధినేత, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వైసీపీ పార్టీని ఉద్దేశించి కొన్ని కీలక వ్యాఖ్యలు చేసారు.
వైసీపీ అధికారం ఉన్నపుడు, ఇప్పుడు అధికారం నుంచి దూరమై 151 నుంచి 11 కి పడిపోయినప్పుడు కూడా తగ్గేదెలా అన్నట్టుగా ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతుందని, అయితే వైసీపీ నేతలలో ఉన్న ఈ కమిట్మెంట్ కు నా అభినందనలు అంటూ, వైసీపీ నేతలలో ఉండే ఈ కమిట్ మెంట్ ను చూసి మనం చాల నేర్చుకోవాలంటూ వైసీపీ రాజకీయ విధానాల పై వారి చర్యల పై వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
151 తో అధికారంలో ఉన్న వైసీపీ వై నాట్ 175 అంటే చివరికి 11 కరిగింది. అయినా కూడా వైసీపీ తగ్గలేదెలా అంటుంది, అవును ఆ వైసీపీ 11 కు కరిగినా తగ్గద్దు, చివరికి ఆ 11 కాస్త 1 కి కరిగినా కూడా తగద్దు, వైసీపీ తగ్గలేదెలా అంటూ తగ్గకుండా ఇలానే రెచ్చిపోతే వైసీపీ తగ్గదు కానీ కరిగిపోతుంది అంటూ పవన్ వైసీపీ తీరు పై సెటైర్లు వేశారు.
Ishan Kishan could be back in India’s Test plans ahead of the upcoming New Zealand…
Kangan Baruah brings a flash of metallic glamour to this striking portrait series. Her silver…