
అయితే ఇపుడు నిర్వహించబోయేది సాధారణ బహిరంగ సభ కాదు. తన వెనుక ఉన్న అభిమాన బలం ఏమిటో రాజకీయ పార్టీలకు, ఆయా పార్టీ నేతలకు తెలియజేసేలా ఏకంగా 35 ఎకరాల్లో నిర్వహించబోతున్నారు. మరో మాటగా చెప్పాలంటే… నిజానికి తన బలం ఏమిటో తనకే తెలియదని పవన్ అనేకమార్లు ప్రస్తావించిన నేపధ్యంలో… ప్రత్యర్ధుల కంటే ముందు తాను తెలుసుకోవడానికి ఈ సభ నిర్వహిస్తున్నారా? అన్న సందేహాలు కూడా పొలిటికల్ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి.
కారణం ఏదైనా… పవన్ బహిరంగ సభ అంటే రాజకీయ పార్టీలకు, మీడియా వర్గాలతో పాటు సామాన్య ప్రజలకు కూడా అత్యంత ఆసక్తికరంగా ఉంటుంది. అయితే ఈ సభలో పవన్ ఎలాంటి ప్రకటనలు చేస్తారు అనేది కీలకం. ఇప్పటివరకు పార్టీకి అన్ని తానై వచ్చారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ, ఇక ‘సోలో’ పర్ఫార్మెన్స్ కు అవకాశం లేదు. ఖచ్చితంగా పార్టీకి సంబంధించిన అధికారిక నేతలను పవన్ ప్రకటించాల్సి ఉంటుంది. మరి వారిని ప్రజలకు పరిచయం చేసేందుకు ఈ సభను వేదిక చేసుకుంటారా? అనేది చూడాలి.
అన్నింటికంటే ముఖ్యమైన అంశం… ఇప్పటివరకు తాను సహకారం అందించిన బిజెపి-టిడిపి ప్రభుత్వాలపై పవన్ ఎలాంటి స్టాండ్ తీసుకుంటారు? అనేది వచ్చే ఏడాది ఎన్నికలలో తీవ్ర ప్రభావితం చూపనుంది. బిజెపిపై యుద్ధానికి సిద్ధమవుతారన్నది ఇప్పటికే పొలిటికల్ వర్గాలు పేర్కొంటుండగా, చంద్రబాబు నాయకత్వంలోని టిడిపి ప్రభుత్వంపై పవన్ ధోరణి ఎలా ఉండనుంది? అలాగే అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటూ కేసుల చుట్టూ తిరుగుతూ, ప్రతిపక్షంగా విఫలమవుతోన్న జగన్ పై ఎలాంటి భావాలను వ్యక్తపరుస్తారు?
వీటన్నింటికి పవన్ నుండి సమాధానం వస్తే ప్రజలకు కాస్త స్పష్టతను ఇచ్చినవారవుతారు. లేదంటే ఈ సభ కేవలం అభిమానుల కోసమే నిర్వహించినట్లుగా తేలిపోతుంది. జన సమీకరణకు అవకాశం లేకుండా, సభ సక్సెస్ కావడం అనేది తధ్యమని అందరికీ తెలిసిన విషయమే. కానీ ఈ సభను పవన్ ఎలా వినియోగించుకోబోతున్నారు అనేదే అసలు విషయం. ఎప్పటిలాగా కన్ ఫ్యూజన్ లో మాట్లాడేసి వెళ్ళిపోతారా? లేక ఎన్నికల నగారను నాగార్జున యూనివర్సిటీ వేదికగా మ్రోగిస్తారా? లెట్స్ వెయిట్ అండ్ సీ!
From Rocky Bhai to Raya, Yash has delivered a bona fide disaster with Toxic.…
Yash's Toxic was sold as a pan-India and global event, but its overseas performance is…