
ముందుగా పవన్ గురించి చెప్పుకుంటే… త్వరలో క్రియాశీల రాజకీయాల్లోకి అడుగు పెట్టనున్న నేపధ్యంలో వరుసగా సినిమాలు ఒప్పుకుంటున్న వైనం తెలిసిందే. అయితే ఒకప్పుడు సినిమా పూర్తయితే గానీ, మరుసటి సినిమాకు కొబ్బరికాయ కొట్టని పవన్, ఇప్పుడు మాత్రం ఒక సినిమా సెట్స్ పైన ఉండగానే రెండు సినిమాలకు కొబ్బరికాయలు కొట్టడం సామాన్యమైన విషయం కాదు. ఇంతకు ముందు ‘జిల్లా’ సినిమా దర్శకుడు నీసన్ దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి కొబ్బరికాయ కొట్టిన పవర్ స్టార్, తాజాగా ఈ రోజు ‘మాటల మాంత్రికుడు’ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సినిమాను లాంఛనంగా ప్రారంభించడం చెప్పుకోదగ్గ విషయం.
పవర్ స్టార్ జోరు ఇలా ఉంటే, ప్రిన్స్ కూడా అదే బాటలోకి రావడం ఆహ్వానించదగ్గ పరిణామం. పవన్ మాదిరే ప్రస్తుతం చేస్తున్న సినిమా పూర్తయితే గానీ, తదుపరి సినిమాపై ఫోకస్ చేయని ప్రిన్స్ కూడా మరుసటి సినిమా మరో నాలుగు రోజుల్లో కొబ్బరికాయ కొట్టబోతున్నారన్న వార్త అభిమానులకు కొత్త ఉత్సాహాన్ని ఇస్తోంది. ప్రస్తుతం మురుగదాస్ దర్శకత్వంలో చేస్తున్న సినిమా దాదాపుగా 60 శాతం షూటింగ్ పూర్తి చేసుకోగా, కొరటాల దర్శకత్వంలో చేయబోయే తదుపరి సినిమాను ఈ నెల 9వ తేదీన పూజా కార్యక్రమాలతో ప్రారంభించబోతున్నారని సమాచారం.
ఈ ఇద్దరి స్టార్ హీరోలు ఈ విధంగా వరుసపెట్టి సినిమాలు చేస్తుంటే… ఒక విధంగా అభిమానులకు పండగ లాంటి వార్తే. మరో వైపు అంతకు మించి సినిమా ఇండస్ట్రీకి చాలా మంచి శకునం. ఒక విధంగా ఇండస్ట్రీ భవిష్యత్తుకు శుభసూచకం. ఈ జోరు ఇలాగే ఓ నాలుగైదేళ్ళ పాటు కొనసాగితే టాలీవుడ్ ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేసిన వారవుతారు. వీరిద్దరే కాదు, ప్రతి అగ్ర హీరో కూడా ఏడాదికి కనీసం మూడు సినిమాలు చేస్తే… ఇండస్ట్రీలో పది మందికి అవకాశం ఇచ్చినవారవుతారు, ఆ పది మంది కుటుంబాలకు కడుపు నిండా భోజనం పెట్టిన వారవుతారు. పవన్, మహేష్ మాదిరే అందరూ హీరోలు ఈ జోరును నిర్విరామంగా కొనసాగిస్తూ… తెలుగు సినీ పరిశ్రమను ప్రపంచ పటంలో పెట్టాలని ఆశిద్దాం.
Allu Arjun’s Forbes India feature was meant to highlight his growing pan-India popularity. Instead, a…
For Allari Naresh, Ramba Oorvasi Menaka is more than just another comedy outing. It marks…