Telugu

అదండీ మ్యాటర్… ఇక పవన్ డిక్లేర్ చేయాలి..!

2019 సంక్రాంతికి బాక్సాఫీస్ వద్ద రణరంగానికి సర్వం సిద్ధమవుతోంది. ఇప్పటికే సుకుమార్ – రామ్ చరణ్ ల “రంగస్థలం” సినిమా ఒక బెర్త్ ను ఖరారు చేసుకుంది. తాజాగా కొరటాల శివ – మహేష్ బాబుల “భరత్ అనే నేను” సినిమా రిలీజ్ డేట్ ను కూడా ప్రకటించేసారు. సంక్రాంతి బరిలో ప్రిన్స్ సక్సెస్ కొట్టిన జనవరి 11వ తేదీ నాడే “భరత్ అనే నేను” కూడా విడుదల చేయనున్నామని… ప్రిన్స్ పుట్టినరోజు సందర్భంగా నిర్మాత డివివి దానయ్య, దర్శకుడు కొరటాల శివ ఖరారు చేసారు.

ఇక ఈ సినిమా షూటింగ్ విషయానికి వస్తే… శుక్రవారం నుండి లక్నోలో పీటర్ హైన్స్ నేతృత్వంలో భారీ యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరణ జరుపుకోనుంది. ఆగష్టు 22 వరకు సాగనున్న ఈ షెడ్యూల్ లో మహేష్ – ప్రకాష్ రాజ్ ల మధ్య కీలక సన్నివేశాలను షూట్ చేయనున్నారు. ప్రస్తుతం సాగుతున్న తీరు చూస్తుంటే… అనుకున్న సమయానికి “భరత్ అనే నేను” ల్యాండ్ కావడం నూటికి నూరు శాతం జరిగే విషయమే. ఇక సంక్రాంతి బరిలో నిలవనున్న మరో హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.

ADVERTISEMENT

త్రివిక్రమ్ – పవన్ కలయికలో రూపుదిద్దుకుంటున్న సినిమా వాస్తవానికి దసరా సమయానికి సిద్ధం కావాల్సి ఉంది. అయితే షూటింగ్ ఆలస్యం అవుతున్న దరిమిలా అక్టోబర్ నాటికి మొత్తం షూటింగ్ ను ముగించి, సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నారని ఇటీవల హల్చల్ చేసిన వార్తలు తెలిసిందే. అయితే అధికారికంగా ఇప్పటివరకు ఎలాంటి సమాచారం ఇవ్వకపోవడంతో, ఆ ఒక్క ప్రకటన వస్తే… సినీ ప్రేక్షకులకు ఇంతకు మించిన సందడి వాతావరణం మరొకటి ఉండదని చెప్పడంలో అతిశయోక్తి లేదు.

‘పవన్ కళ్యాణ్ X మహేష్ బాబు’ బాక్సాఫీస్ వద్ద పోటీపడి చాలా కాలం అయిపోయింది. దీంతో వీరిద్దరి సినిమాల మధ్య పోటీ ఉన్నప్పటికీ, అది ప్రత్యక్షంగా లేకుండా పోయింది. రానున్న రోజుల్లో పూర్తిగా రాజకీయాలలో పాల్గొంటానని చెప్పడంతో… మరి సంక్రాంతికి తన సినిమాను విడుదల చేసి, సినీ ప్రేక్షకులకు పవన్ ఆ ‘మజా’ను పంచుతారేమో చూడాలి. దీంతో త్రివిక్రమ్ నుండి గానీ, పవన్ నుండి గానీ ఓ అధికారిక ప్రకటన కోసం అంతా వేచిచూస్తున్నారు. బహుశా పవన్ పుట్టినరోజుకు ఈ ప్రకటన వెలువడవచ్చు.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

JSP Jai Kottu: Youth Energy At Its Peak!

One of the main advantages for Pawan Kalyan, from the early stages of political career…

23 minutes ago

From Lady Superstar to a Box Office Question

Nayanthara has built one of the strongest brands for a South Indian heroine. But her…

35 minutes ago