Telugu

పవన్ కళ్యాణ్ తో సెల్ఫీ దిగలేకపోయాను… కానీ..!

అప్పుడప్పుడు అభిమానులను అవాక్కయ్యేలా చేయడంలో పవన్ కళ్యాణ్ సిద్దహస్తుడు. ముందస్తు సమాచారం లేకుండా సర్ ప్రైజ్ లిచ్చే పవన్, తాజాగా ‘మిర్చి మ్యూజిక్ అవార్డ్స్’కు విచ్చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. దీంతో పవన్ లుక్ కూడా అందరికీ దర్శనమిచ్చింది. అంతకుముందు మీసాలు తీసేసి, చూడడానికి కాస్త ఇబ్బందికరంగా ఉన్న పవన్ లుక్, ప్రస్తుతం ఫ్యాన్స్ విజిల్స్ వేసే విధంగా మార్చేసుకున్నాడు. పెంచిన మీసకట్టు, సింపుల్ లుక్ తో ‘మిర్చి మ్యూజిక్ అవార్డ్స్’లో ఉత్తమ సంగీత దర్శకుడిగా దేవిశ్రీప్రసాద్ కు పురస్కారాన్ని అందజేశాడు పవన్.

ADVERTISEMENT

అయితే ఈ కార్యక్రమానికి యాంకరింగ్ నిర్వహిస్తున్నటువంటి శ్రీముఖి మాత్రం పవన్ తో సెల్ఫీ దిగలేకపోయానని నిరుత్సాహపడింది. కానీ, పవన్ తో సెల్ఫీ ఎందుకు తీసుకోలేకపోయానో కూడా వివరించింది. ఓ పక్కన తన ఫోన్ తో పవర్ స్టార్ ని రికార్డ్ చేయడం మొదలుపెట్టడంతో, సెల్ఫీ అవకాశం దక్కలేదని సోషల్ మీడియా వేదికగా… ఈ ముద్దుగుమ్మ రికార్డ్ చేసిన పవన్ వీడియోను పోస్ట్ చేస్తూ, తన అనుభూతులను, ఆనందాన్ని పంచుకుంది. ఇలాంటి వేడుకలకు సాధారణంగా చాలా సింపుల్ గా వచ్చే పవన్, ఈ సారి మాత్రం టక్, షూస్ తో నీట్ గా డ్రెస్ చేసుకుని రావడం విశేషం.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

175/175కి కారణం కనిపిస్తోంది కానీ జగన్‌ 2.0కి ఉందా?

స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీలు మెజార్టీ సీట్లు దక్కించుకుంటే వార్త అవుతుంది తప్ప అధికార పార్టీ దక్కించుకుంటే కాదు.…

30 minutes ago

Simbu and Nayanthara: An Unexpected Reunion on Cards?

A Simbu film usually creates enough curiosity, but the latest buzz around his next project…

48 minutes ago