
టీడీపీ – జనసేనల పొత్తు ప్రకటన తర్వాత జరగబోతున్న మొదటి ప్రజా సమావేశం కావడంతో సహజంగానే రాజకీయ వర్గాలలో అత్యంత ఆసక్తిని చూరగొంది. ఇప్పటివరకు జరిగిన వారాహి యాత్రలో కేవలం జనసేన యొక్క విధివిధానాలు, అలాగే అధికారంలోకి వస్తే జనసేన ఏం చేయగలుగుతుందో అన్నది మాత్రమే పవన్ ప్రస్తావించారు.
కానీ నేటి పరిస్థితులు వేరు. దీంతో పవన్ ప్రసంగం ఏ స్థాయిలో ఉండబోతోందన్న ఆసక్తి జనసైనికుల కంటే టీడీపీ వర్గాలు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. క్షేత్రస్థాయి నుండి జనసేనను పొత్తు వైపుకు నడిపించే బాధ్యతను ఇప్పటికే పవన్ కళ్యాణ్ తీసుకోగా, ఎలాంటి వివాదాలకు తావు లేకుండా జనసేనతో కలిసి పనిచేసే బాధ్యతను టీడీపీలో ఎవరు తీసుకుంటారనేది వేచిచూడాలి.
ఇదిలా ఉంటే, ఈ రెండు పార్టీల నడుమ చిచ్చు పెట్టి రాజకీయ లబ్ది పొందే ఉద్దేశంలో అధికార వైసీపీ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటుందని చెప్పడంలో సందేహం లేదు. ఇప్పటికే వారికి సంబంధించిన బ్లూ మీడియాలలో పొత్తు చిత్తయిపోయిందని ప్రత్యేక కధనాలు ప్రసారం చేసుకుంది.
ముఖ్యంగా బహిరంగ సభలలో అలజడి చెలరేగితే, అది ఎక్కువ మందికి చేరుకునే అవకాశం ఉంటుంది, అలాగే మీడియా కూడా అత్యంత ప్రాధాన్యతను ఇస్తుంది గనుక, రేపటి నుండి కృష్ణాజిల్లా, అవనిగడ్డలో ప్రారంభం కాబోతున్న వారాహి యాత్రను పవన్ కళ్యాణ్ ఎంత విజయవంతంగా ముగిస్తారో చూడాలి. ఓ విధంగా ఇది జనసేన అధినేతకు పెద్ద పరీక్ష అనే చెప్పాలి.
Ranabaali Review: History Without Heart A film rooted in heart-wrenching stories is let down by…
Rajinikanth's Jailer 2 has taken a strong start at the global box office and is…