
మాస్ లో విపరీతమైన ఫాలోయింగ్ కలిగిన హీరోలలో మెగాస్టార్ ఒకరు. అయితే చిరు సినిమాలను వీడి ఒక దశాబ్దం గడవడంతో, ఈ సమయంలో ఎన్నో మార్పులు వచ్చాయి. ముఖ్యంగా ఆ మాస్ ఫాలోయింగ్ ను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పూర్తిగా కబ్జా చేసారనే చెప్పాలి. షర్టులపై పవన ఫోటోలు, పవన్ సినిమాల రిస్ట్ బ్యాండ్లు… ఇలా ఒకటేమిటి… మాస్, యూత్ ఫాలో అయ్యే ట్రెండ్స్ అన్నింటికీ పవన్ ఆరాధ్యుడిగా మారారు. అయితే ప్రస్తుతం సీన్ రివర్స్ అవుతోంది.
చిరు పొలిటికల్ ఎంట్రీ మాదిరే ప్రస్తుతం పవన్ రాజకీయాల్లోకి, చిరు మళ్ళీ రీ ఎంట్రీకి సిద్ధమవుతున్నారు. దీంతో పవన్ కున్న మెగా మాస్ ఫాలోయింగ్ ను మెగాస్టార్ ఆకర్షిస్తారా? అంటే ఖచ్చితంగా అన్న సమాధానం వెలువడుతోంది. చెక్కుచెదరని ఫాలోయింగ్ మెగాస్టార్ సొంతమని, అందుకే ఈ నిదర్శనమే ఈ టీ షర్టులని సోషల్ మీడియాలో మెగా హంగామా మొదలైంది. మెగాస్టార్ ఫోటోలను ముద్రించిన ఈ టీ షర్టులు మాస్ మెగా అభిమానులను ఆకర్షిస్తున్నాయి.
ప్రస్తుతం నటిస్తున్న “ఖైదీ నంబర్ 150” విడుదల కాకముందే ఇంత హంగామా చేస్తుంటే… రేపు విడుదల సమయం దగ్గర పడితే… మెగా సందడి మామూలుగా ఉండదని సినీ జనాలు అభిప్రాయ పడుతున్నారు. అందులోనూ హంగామా చేయడంలో మెగా ఫ్యాన్స్ మిగిలిన వారి కంటే కాస్త ఎక్కువ నైపుణ్యతే ప్రదర్శిస్తారన్న విషయం తెలిసిందే. ఈ మెగా వాతావరణంతో సినీ అభిమానుల్లోనూ నూతన ఉత్తేజం కనపడుతోంది.
Nora Fatehi turns a hotel-room backdrop into her own fashion runway, bringing fearless glamour to…
వై నాట్ 175, ప్రతిపక్షం లేని ఏకైక రాష్ట్రం గా ఏపీ, వై నాట్ కుప్పం.? వై నాట్ మంగళగిరి.?…