
జనసేనాని పవన్ కళ్యాణ్‌ను మరోసారి ఓడించగలిగితే ఆయన రాజకీయ జీవితం, పార్టీ రెండూ సమాప్తం చేయవచ్చని వైసీపి భావిస్తోంది. కనుక ఆయన పోటీ చేస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో భారీగా డబ్బు ఖర్చు చేసేందుకు వైసీపి వెనకాడటం లేదు.
కానీ ఎంత డబ్బు పంచినా పవన్ కళ్యాణ్‌ని ఓడించలేమని అనుకుందో ఏమో బ్లేడ్ బ్యాచ్‌లను రంగంలో దింపిందని పవన్ కళ్యాణ్ స్వయంగా ఆరోపించారు. తాజాగా చిత్తూరు నుంచి మంత్రి పెద్దిరెడ్డి 40 మంది ఎర్రచందనం స్మగ్లర్లను పిఠాపురంతో సహా గోదావరి జిల్లాలో దింపారాణి పవన్ కళ్యాణ్ ఆరోపించారు.
అయితే తాను ప్రాణాలకు తెగించే రాజకీయాలలోకి వచ్చానని, ఇలాంటి వాటికి భయపడి వెనక్కు తగ్గే ప్రసక్తే లేదన్నారు. పవన్ కళ్యాణ్ మరో ఆసక్తికరమైన విషయం కూడా చెప్పారు.
“చిత్తూరు జిల్లాలో వేరెవరూ అడుగుపెట్టడానికి వీల్లేదన్నట్లు పెద్దిరెడ్డి వ్యవహరిస్తుంటారు. కానీ ఆయన కొడుకు మిధున్ రెడ్డి వచ్చి ఇక్కడ గోదావరి జిల్లాలలో వేలు పెడుతుంటాడు. చిత్తూరుకు చెందిన మీరు గోదావరి జిల్లాలో రాజకీయాలు చేయడానికి వస్తే ఎవరూ తప్పు పట్టకూడదు.
కానీ మేము చిత్తూరు జిల్లాలో అడుగుపెట్టకూడదా? చిత్తూరు జిల్లా ఏమైనా పెద్దిరెడ్డి సొంత సామ్రాజ్యమా… ఎవరు అడుగు పెట్టకూడదని చెప్పడానికి?వైసీపి నేతలందరూ ఇలా రాష్ట్రంలో సొంత సామ్రాజ్యాలు ఏర్పాటు చేసుకొని పాలించాలనుకుంటే కుదరదు. మనది ప్రజాస్వామ్య వ్యవస్థ అని గుర్తుంచుకోవాలి,” అని పవన్ కళ్యాణ్ ఘాటుగా హెచ్చరించారు.
వైసీపి మూడు రాజధానుల ప్రతిపాదన ఆయా ప్రాంతాల అభివృద్ధి కోసమే అని చెపుతున్నప్పటికీ, ఆ పేరుతో మూడు ప్రాంతాల ప్రజల మద్య చీలికలు తెచ్చి, అమరావతి రాజధాని అంటున్న టిడిపి, జనసేనలను రాయలసీమ, ఉత్తరాంధ్రా జిల్లాలలో అడుగుపెట్టనీయకుండా చేయాలనే దురాలోచన కూడా ఉంది.
కానీ వైసీపి అనుకొన్నట్లు ప్రజలు మూడు రాజధానుల ఉచ్చులో పడలేదు. పడి ఉంటే నేడు ఎన్నికలలో ‘వైసీపి ఆడిందే ఆట… పాడిందే పాట’ అన్నట్లుండేది. ఆ దురాలోచన ఫలించకపోవడంతో ఇప్పుడు ఆయా జిల్లాలు, నియోజకవర్గాలలో వైసీపి నేతల చేత టిడిపి, జనసేన నేతలు, కార్యకర్తలను ఈవిదంగా కట్టడి చేయించాలని ప్రయత్నిస్తున్నట్లు కనబడుతోంది.
కానీ ఈ దురాలోచన కూడా ఫలించడం లేదని స్పష్టమవుతోంది. రాష్ట్రాభివృద్ధి చేసి ప్రజలను ఓట్లు అడగాల్సిన వైసీపి, ప్రతిపక్షాలను వేధించి, బెదిరించి, బ్లేడ్ బ్యాచ్‌లతో భయపెట్టి పోటీ లేకుండా చేసుకొని గెలవాలనుకోవడం చాలా దారుణమే కదా?
Kriti Sanon is ready to enter uncharted territory with her next big screen outing. The…
Vijayawada leader Vangaveeti Radha Krishna has joined the Jana Sena Party after leaving the Telugu…